Begin typing your search above and press return to search.

పబ్ లో పరిచయమైన అమ్మాయిని ఇంటికి పిలిస్తే..?

By:  Tupaki Desk   |   12 Jan 2020 3:21 AM GMT
పబ్ లో పరిచయమైన అమ్మాయిని ఇంటికి పిలిస్తే..?
X
పరిచయమైన అందరూ మంచోళ్లే ఉండరు. ఆచితూచి అడుగులు వేయకపోతే ఎలాంటి ప్రమాదాల్ని కొని తెచ్చుకోవచ్చన్న విషయాన్ని చెప్పే ఉదంతాన్ని ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. పబ్ లో పరిచయమైన ఒక అమ్మాయిని.. వాట్సాప్ లో చాటింగ్ చేసి.. ఇంటికి రమ్మన్న అతగాడికి దిమ్మ తిరిగే షాక్ తగలటమే కాదు.. భారీగా బొమ్మ కనిపించి.. పరుగులు పెడుతూ పోలీసుల సాయాన్ని కోరాడు. ఇంతకూ జరిగిందేమంటే?

టర్కీకి చెందిన ఒక వ్యక్తి పారిస్ లో పని చేస్తుంటాడు. అతగాడికి తరచూ పబ్ కు వెళ్లే అలవాటు ఉంది. అలా పబ్ కు వెళ్లిన వేళ.. ఒక అమ్మాయి పరిచయమైంది. మాటలు కలిపిన అతగాడు.. ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాడు. ఇంతవరకూ ఓకే. ఫోన్ నెంబరు తీసుకున్న తర్వాత.. వేళ్లు.. వాట్సాప్ వైపునకు వెళ్లకుండా ఉంటాయా? చెప్పండి.

అందరిలానే ఆ కుర్రాడు..తనకు పరిచయమైన ఆ అమ్మాయి వాట్సాప్ కు మెసేజ్ పంపాడు. సదరు కుర్రాడు కోరుకున్నట్లే.. అవతల వైపు నుంచి మెసేజ్ లు. అలా మొదలైన చాటింగ్.. తన ఇంటికి ఆమెను ఆహ్వానించే వరకూ వెళ్లింది.

అనుకున్నట్లే.. ఒక రోజు ఆమె చెప్పినట్లే.. ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ మోగించింది. మాంచి ఉత్సాహంలో ఉన్న సదరు కుర్రాడు.. ఎదురుగా వచ్చిన అపాయాన్ని గుర్తించలేకపోయాడు.ఆనందంతో డోర్ తీశాడు. ఫోన్ లో చాటింగ్ చేసిన పాప ఒక్కతే వస్తుందనుకుంటే.. ఆమెతో పాటు మొత్తం ఎనిమిది మంది ఇంట్లోకి బిలబిలా వచ్చేశారు. వారు కూడా మామూలోళ్లు కాదు.. ఆఫ్రికన్ మహిళలు. మాంచి బలంగా ఉండటమే కాదు.. రావటంతోనే దాడి చేసి.. అందినకాడికి దోచేశాడు.

మొత్తంగా రూ.11 లక్షల (మన రూపాయిల్లో) విలువైన వస్తువుల్ని.. క్యాష్ ను కొట్టేశాడు. జరిగిందంతా మోసమని గ్రహించిన కుర్రాడు.. పరుగు పరుగున పోలీసుల వద్దకు వెళ్లి.. తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. స్పందించిన పోలీసులు పబ్ లో పరిచయమైన పాపను పట్టుకోవటమే కాదు.. ఆమెను విచారిస్తే.. తనతో పాటు వెళ్లిన గ్యాంగ్ కు చెందిన మహిళలు ఎక్కడ ఉంటారో చెప్పటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందుకే అంటారు.. ముక్కుముఖం తెలీనోళ్లతో రాసుకుపూసుకు తిరిగితే ముప్పు ఎటువైపు నుంచైనా ముంచుకొస్తుందని. తస్మాత్ జాగ్రత్త సుమా.