Begin typing your search above and press return to search.

అర‌గంట గ‌డిపితే.. అన్నీ చేస్తా: క్రీడా కోచ్‌కు మంత్రి సెక్సువ‌ల్ హెరాష్‌మెంట్‌

By:  Tupaki Desk   |   30 Dec 2022 5:10 AM GMT
అర‌గంట గ‌డిపితే.. అన్నీ చేస్తా:  క్రీడా కోచ్‌కు మంత్రి సెక్సువ‌ల్ హెరాష్‌మెంట్‌
X
''మ‌నం-మ‌నం ఒక‌టి.. రూమ్‌కు వ‌చ్చెయ్‌.. నాకు స‌హ‌క‌రించు.. నువ్వు ఏం అడిగినా చేస్తా'' ఇదీ.. ఓ మంత్రి క్రీడా రంగానికి చెందిన ఒక మ‌హిళా కోచ్‌కు ఇచ్చిన ఆఫ‌ర్‌. దీంతో ఆమె ఈ విష‌యాన్ని రికార్డు చేసి.. బ‌హిర్గతం చేసింది. ఈ విష‌యం ఇప్పుడు హ‌రియాణ ప్ర‌భుత్వాన్ని డిఫెన్స్‌లో ప‌డేసింది. ప్ర‌తిప‌క్షాలు స‌ద‌రు మంత్రిని వెంట‌నే మంత్రి వ‌ర్గం నుంచి తప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఏం జ‌రిగిందంటే..హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ తనను లైంగిక వేధించాడని జూనియర్ మహిళా అద్లెట్ కోచ్ ఆరోపించారు. మంత్రి తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించారని ఆమె తెలిపారు.

తనకు అనుకూలంగా వ్యవహరించి, రూమ్ వ‌చ్చి.. అర‌గంట గ‌డిపితే అన్ని సౌకర్యాలు కల్పిస్తానని వ్యాఖ్యానించార‌ని ఆమె ఆరోపణలు గుప్పించారు. మంత్రి సందీప్ నాతో సోషల్ మీడియా ద్వారా చాట్ చేశారని.. కానీ చాట్ రికార్డ్ చేసిన‌ట్టు ఆమె తెలిపారు.

"మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తే కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానని అన్నారు. నేను ఆయనకి లొంగకపోవడం వల్ల వేరే ప్రదేశానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై డీజీపీ ఆఫీస్, సీఎం కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.

అందుకే ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలను కలిశా. ఆయన ఇచ్చిన ధైర్యంతో మీడియా ముందుకు వచ్చా. ఇలా చాలా మంది మహిళా క్రీడాకారిణులను మంత్రి లైంగికంగా వేధించారు. వారెవరూ మంత్రికి భయపడి బయటికి చెప్పట్లేదు'' అని మహిళా అథ్లెట్ కోచ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మహిళా అథ్లెట్ కోచ్పై లైంగిక వేధింపుల విషయంలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తక్షణమే స్పందించి.. మంత్రిని బర్తరఫ్ చేయాలని ఐఎన్ఎల్డీ నాయకుడు అభయ్ చౌతాలా డిమాండ్ చేశారు. క్రీడాకారులతో మంత్రి ఇలాగే ప్రవర్తిస్తే వారు మెడల్స్ ఎలా సాధిస్తారని అన్నారు. ఈ ఘటనపై సందీప్ సింగ్ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.