Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ తో బోర్ కొట్టి..ఆత్మహత్య చేసుకున్న యువతి!

By:  Tupaki Desk   |   29 April 2020 3:26 PM GMT
లాక్‌ డౌన్‌ తో బోర్ కొట్టి..ఆత్మహత్య చేసుకున్న యువతి!
X
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి. అయితే , ఈ లాక్ డౌన్ వల్ల కరోనా మహమ్మారి ఏ మేర కట్టడి అవుతుంది అనే విషయం పక్కన పెడితే .. ఈ లాక్ డౌన్ వల్ల జరిగే అనర్దాలు అన్ని , ఇన్ని కావు. కొంతమంది ఆకలితో అలమటిస్తూ .. ఆకలి చవులు చస్తుంటే ... మరికొంతమంది ఇంట్లో ఉండలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది లాక్ డౌన్ తో ఇంట్లో ఉండలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి ..ఏపీ , చిత్తూరు జిల్లాలో జరిగింది. ఓ యువతి, లాక్ డౌన్ తో ఇంట్లో ఉండటంతో బోర్ కొడుతోంది అని , అలాగే క్లాస్ మేట్ కూడా ఫోన్ చేయడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది. ఈ ఘటన పై పూర్తి వివారాలు చూస్తే ..చిత్తూరు జిల్లా కలకడ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో అంజనా దేవి ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఈమెకు 18 ఏళ్ల కూతురు ఉంది. ఈమె విజయవాడలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది.

అయితే , కరోనా లాక్ ‌డౌన్ అమలు చేయడంతో ఏప్రిల్ 3వ తేదీన ఆ యువతి ఇంటికి వెళ్లింది. ఆ తరువాత ప్రతి రోజు ఆ యువతీ తన క్లాస్ మేట్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. అలాగే , నెలరోజుల నుంచి ఇంట్లోనే కూర్చుని ఉండలేకపోతున్నానని, లాక్ డౌన్ ఎత్తేస్తే కాలేజీకి వెళ్లిపోతానని ఇరుగు పొరుగు వారి దగ్గర అనేకసార్లు ప్రస్తావిస్తూ ఉండేది. అయితే , గడిచిన మూడు రోజులుగా ఎవరు ఫోన్ లో అందుబాటులో కి రాకపోవడంతో ..ఇంట్లో బోర్ గా ఫీల్ అయ్యి , తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ యువతీ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేవలం స్నేహితులు ఫోన్ చేయకపోవడం వల్లనే ఈమె ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.