Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులు ... శానిటైజర్ తాగి యువతీ ఆత్మహత్యాయత్నం !
By: Tupaki Desk | 15 Sep 2020 12:30 PM GMTవిశాఖలో దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడింది. బాకీ డబ్బుల కోసం ఈగల సత్యం వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీనితో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యం అరాచకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై అతడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక వివాహిత శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
బాధితురాలి కొడుకు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తారు. పెద వాల్తేరు ప్రాంతంలో ఎస్తేరు రాణి అనే మహిళ రోడ్డు పక్కన హోటల్ నడుపుతుంది. ఈ క్రమంలో అదే ప్రాంతం లో నివసిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యం తరచూ బాధిత మహిళ హోటల్ కి వెళ్లేడమే కాకుండా, అక్కడ హోటల్ కొనసాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని బెదిరించేవాడు. అంతేకాదు తనతో సన్నిహితంగా మెలగకపొతే, లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టు ఎస్తేరు రాణి పై తప్పుడు కేసు పెడతానని బెదిరించేవాడట. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కూడా బాధితురాలిని తన తోనే ఉండాలని బెదిరించాడని సమాచారం. అంతేగాక నడి రోడ్డుపైనే విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ అవమానం తట్టుకోలేక ఆ బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు ఆమెను కేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఈగల సత్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.