Begin typing your search above and press return to search.

హోంమంత్రి దగ్గరకు వచ్చిన ఆమె మాటతో షాక్ తిన్నారు

By:  Tupaki Desk   |   25 Dec 2019 5:33 AM GMT
హోంమంత్రి దగ్గరకు వచ్చిన ఆమె మాటతో షాక్ తిన్నారు
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించని జనతా దర్బార్లు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తుంటారు. ముఖ్యమంత్రి మాత్రమే కాదు పలువురు కీలక మంత్రులు జనతా దర్బార్లను ఏర్పాటు చేస్తారు. ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యల్ని చెప్పుకోవటం.. వినతిపత్రాల్ని అందించే వీలుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి కనిపించవనుకోండి.

తాజాగా హర్యానాలో ఇలానే నిర్వహించిన జనతా దర్బార్ కు వచ్చిన మహిళ ఒకరు అందరికి షాకిచ్చారు. హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ జనతాదర్బార్ ను నిర్వహించారు. ఒక వివాహిత ఆయన వద్దకు వచ్చి వినతిపత్రాన్ని అందించారు. అందులోని మేటర్ చూసి ఆయన షాక్ తిన్నారు.

నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశా.. ఈ నేరానికి నాకు శిక్ష విధించండి అంటూ ఆమె పేర్కొనటంతో ఉలిక్కిపడ్డారు. రెండేళ్ల క్రితం తాను చేసిన తప్పునకు భోరుమన్న ఆమె తీరుతో ఆయన నోట మాట రాలేదు. అంతలోనే సర్దుకొని పోలీసులను పిలిచి.. ఆమెను అదుపులోకి తీసుకోమన్నారు. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. భర్తను ఆమె ఎందుకు హత్య చేశారు? అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. విచారణలో ఈ విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.