Begin typing your search above and press return to search.

మోడీ పై ప్రేమ.. సిద్దుపై చెప్పుతో దాడి

By:  Tupaki Desk   |   9 May 2019 7:45 AM GMT
మోడీ పై ప్రేమ.. సిద్దుపై చెప్పుతో దాడి
X
దేశంలో రెండే రెండు జాతీయ ప్రధాన పార్టీలు.. కాంగ్రెస్ లేదంటే బీజేపీ.. ఈరెండు పార్టీల మద్దతు దారులు ఎవరి ప్రచారానికి వారు హాజరవుతుంటారు.. రాహుల్ వస్తే కాంగ్రెస్ అభిమానులు.. మోడీ వస్తే బీజేపీ అభిమానులు వస్తారు. కానీ ఈ మహిళ.. మోడీకి వీరాభిమానిగా ఉంది.. కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార సభకు వెళ్లింది. కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోతిసింగ్.. మోడీని తిట్టడం మొదలుపెట్టగానే తట్టుకోలేక చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటన పంజాబ్ లోని రోహతక్ లో కలకలం రేపింది..

రోహతక్ స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున ఎంపీ అభ్యర్థిగా దీపేందర్ హుడా పోటీచేస్తున్నారు. మంగళవారం రాత్రి ప్రచారం నిమిత్తం సిద్దూను ఆహ్వానించారు. వేదికపై సిద్దూ మాట్లాడుతూ మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో మోడీకి అభిమాని అయిన ఓ మహిళకు చిర్రెత్తుకొచ్చి సిద్దూపైకి చెప్పును విసిరింది. మోడీని దొంగగా అంటావా అని వేదిక వద్ద మోడీకి అనుకూలంగా నినాదాలు చేసింది.

అయితే మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై గురువారం పోలీసులు స్పందించారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సిద్దూపై చెప్పుతో దాడి చేసినట్లు ఆ మహిళ స్పష్టం చేసింది. ఇలా మోడీపై ప్రేమ కాస్తా సిద్దూపై కోపంతో చెప్పుతో దాడి చేసే వరకు పరిస్థితి వెళ్లింది. ప్రస్తుతం ఆమె కటకటాల పాలైంది.