Begin typing your search above and press return to search.
బిర్యానీ తిని మహిళ మృతి.. కేరళలో రెండో ఘటన..!
By: Tupaki Desk | 7 Jan 2023 3:30 PM GMTఇటీవలి కాలంలో ఆన్ లైన్ వ్యాపారానికి గిరాకీ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చిన్న పెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు తమ వస్తువులన్నీ నేరుగా ఇంటికి డెలివరీ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ చేసే సంస్థలు క్షణాల్లోనే ఆర్డర్లను కస్టమర్లకు అందజేస్తున్నాయి.
బ్యాచిలర్స్.. ఉద్యోగాలు చేసే వారంతా బిజీ లైఫ్.. ఇతరత్రా కారణాల వల్ల ఆన్ లైన్లో తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. అయితే ఆన్ లైన్లో ఇంటికే వచ్చే ఆహారం ఏమేరకు సురక్షితమైనదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి ఓ ప్రముఖ రెస్టారెంట్ కు చెందిన బిర్యానినీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. 2022 డిసెంబర్ 31న స్థానికంగా ఉండే ఓ రెస్టారెంట్ నుంచి కుజిమంతి బిర్యానీని ఆర్డర్ చేసింది. అయితే అది తిన్న తర్వాత ఆ యువతి అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే పరిస్థితి విషమించడంతో ఆమెను ఆ తర్వాత కర్ణాటకలోని మంగళూరులోని మరొక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఫుడ్ పాయిజనింగ్‌తో మృతిచెందడంతో విషాదచాయలు నెలకొన్నాయి. యువతి తల్లిదండ్రులు రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న రెస్టారెంట్ల లైసెన్స్‌ను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా కొట్టాయం మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తున్న మరో మహిళ కూడా కోజికోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది.
ఆమె సైతం ఫుడ్ పాయిజన్ తో చనిపోయింది. ఇలాంటి ఘటనలు జరుగడంతో కేరళలో ఇదే రెండో కేసు. రెస్టారెంట్ నిర్వాహాకులు నిర్లక్ష్యం కారణంగానే కేరళలో ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ సెఫ్టీ అధికారులు కేరళలోని పలు రెస్టారెంట్లలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.