Begin typing your search above and press return to search.

బీఅలెర్ట్‌: తిరుప‌తిలో నిఫా వైర‌స్‌?

By:  Tupaki Desk   |   3 Jun 2018 4:51 AM GMT
బీఅలెర్ట్‌:  తిరుప‌తిలో నిఫా వైర‌స్‌?
X
ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్ని వ‌ణికిస్తున్న నిఫా వైర‌స్ ను భార‌త్ లోని కేర‌ళ రాష్ట్రంలో గుర్తించ‌టం తెలిసిందే. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో ప‌లువురు మృత్యువాత ప‌డ్డారు. మందు లేని ఈ వైర‌స్ ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందోనన్న భ‌యాందోళ‌న‌లో ఉన్న వారికి మ‌రింత భ‌యానికి గురి చేసేలా ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతోంది.

ఇప్ప‌టికే కేర‌ళ‌కు వెళ్లేందుకు ప‌లువురు భ‌య‌ప‌డుతున్నారు. నిఫా వైర‌స్ కార‌ణంగా కేర‌ళ‌లో టూరిజం భారీగా దెబ్బ తింది. ఇదిలా ఉంటే.. నిఫా వైర‌స్ కేర‌ళ నుంచి తాజాగా తిరుప‌తికి చేరుకున్న‌ట్లుగా తెలుస్తోంది. కేర‌ళ రాష్ట్రం నుంచి ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తికి వ‌చ్చిన ఒక మ‌హిళా వైద్యురాలిలో ఈ వైర‌స్ ఉన్న‌ట్లుగా గుర్తించారు.

తిరుప‌తికి చెందిన కేర‌ళ వైద్యురాలు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టంతో ఆమెను రుయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనుమానంతో ప‌రీక్ష‌లు చేయ‌గా.. ఆమెకు నిఫా వైర‌స్ సోకిన‌ట్లుగా అనుమానిస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం స‌ద‌రు వైద్యురాలికి నిఫా వైర‌స్ సోకిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. పందులు.. గ‌బ్బిలాల నుంచి సోకే ఈ వైర‌స్ కు మందులు లేవు. ఇటీవ‌ల ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ మందును క‌నుగున్న‌ట్లుగా చెబుతున్నారు. చెట్ల నుంచి రాలిన ప‌ళ్ల‌ను తిన‌కుండా ఉండ‌టం.. మాంసాహారానికి దూరంగా ఉండ‌టం నిఫా బూచి నుంచి త‌ప్పించుకునే వీలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.