Begin typing your search above and press return to search.

సిరియాలో జరిగేది ఇండియాలోనూ జరిగిందే

By:  Tupaki Desk   |   23 April 2016 4:52 AM GMT
సిరియాలో జరిగేది ఇండియాలోనూ జరిగిందే
X
నరరూప రాక్షసులుగా అభివర్ణిస్తూ.. మానవత్వం ఏ మాత్రం కనిపించని రాక్షసులుగా అభివర్ణిస్తూ ఐఎస్ తీవ్రవాదుల గురించి చాలానే చెబుతుంటాం. వారి పడగ నీడలో బతుకుతున్న ఇరాక్.. సిరియా ప్రజల గురించి విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తుంటాం. కానీ.. దేశంలోనూ ఐఎస్ తీవ్రవాదుల తరహాలో.. కొందరు వ్యక్తులు వ్యవహరించే ధోరణి చూసినప్పుడు వామ్మో అనుకోకుండా ఉండలేం. ఐఎస్ తీవ్రవాదుల్ని ప్రపంచ దేశాలు పట్టనట్లుగా ఉన్నట్లే.. దేశంలో కొందరు చేసే ఆరాచకాలకు చట్టం తన పని తాను అస్సలు చేయకపోవటాన్ని చూడొచ్చు.

తాజాగా అలాంటి దారుణ సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ముక్త్సర్ నగరంలోని ఒక కంప్యూటర్ సెంటర్ లో పని చేస్తున్న మహిళను ఆమె గ్రామానికి చెందిన వ్యక్తి బలవంతంగా ఆఫీసులో నుంచి ఈడ్చుకొని వెళ్లటమేకాదు.. తన ఫాంహౌస్ లో రాత్రంతా అత్యాచారం చేసినా పోలీసులు పెద్దగా స్పందించలేదు. ఇంత దారుణం ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నించినా.. బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పినా వారు లైట్ తీసుకోవటం గమనార్హం. తన గోడు ఎంత వెల్లబోసుకున్నా స్పందించని పోలీసుల తీరుతో విసిగిపోయిన బాధిత మహిళ.. తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. ఆమెను ఆపీసు నుంచి ఈడ్చుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డు అయినా.. నిందితుడి మీద చర్యలు తీసుకోని తీరు చూసినప్పుడు సిరియాలో ఐఎస్ తీవ్రవాదుల తరహాలోనే దేశంలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం కనిపిస్తుంది.