Begin typing your search above and press return to search.
బావ అంటూ హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపింది
By: Tupaki Desk | 25 April 2019 7:26 AM GMTఫుల్ గా తాగేసిన యువతి వైనం హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపించింది. అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డు లాంటి ఎస్సార్ నగర్ ప్రాంతంలో రోడ్డు మీద వీరంగం వేస్తున్న సదరు మహిళ దెబ్బకు పోలీసులు ఠారెత్తిపోయారు. తమ వ్యవహారశైలితో సామాన్యులకు చుక్కలు చూపే పోలీసులు.. సదరు మహిళ కారణంగా పడిన అవస్థలు అన్ని ఇన్ని కావని చెబుతున్నారు.
తెల్లవారుజాము ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఒక యువతి రోడ్డు మీద చిత్రంగా వ్యవహరించిందని.. ఆమె ఫుల్ గా తాగేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన ఆమె.. ఎస్ ఐ.. పోలీస్ కానిస్టేబుళ్లను బావ.. బావ.. అంటూ పిలుస్తూ ఆమె చేసిన చేష్టలకు పోలీసులకు తలనొప్పిగా మారింది.
108 సిబ్బందికి ఫోన్ చేసి ఆమె మత్తును దించే ప్రయత్నం చేశారు.మత్తు తగ్గిన తర్వాత ఆమె వివరాల్ని సేకరించిన పోలీసులు.. కౌన్సెలింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ యువతిపై కేసు నమోదు చేశారా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. మద్యం మత్తులో హడావుడి చేసిన యువతి వ్యవహారం పోలీస్ శాఖలో జోరుగా చర్చగా జరిగింది.