Begin typing your search above and press return to search.
పోకిమాన్ ఆడుతూ ఇవేమి పనులో...
By: Tupaki Desk | 23 July 2016 7:55 AM GMTపోకిమాన్ గో గేమ్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని పిచ్చెక్కించేందుకు తనవంతు ప్రయత్నం తాను చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ గేమ్ పై ప్రపంచ వ్యాప్తంగా రకరకాల చర్చలు నడుస్తుండగా.. ఈ గేమ్ పై ఆయా దేశాలు రకరకాల కండిషన్స్ పెట్టడం - మరికొన్ని దేశాలు నిషేదాన్ని విదించడం - సౌదీ మతపెద్దలైతే ఏకంగా ఫత్వా జారీచేయడం తెలిసిందే. వారంతా ఈ పనులు చేయడం సరైందే అనేలా పోకిమాన్ గేమ్ ను ఆడుతున్నకొంతమంది ప్రవర్తన ఉంది.
వివరాళ్లోకి వెళితే... తాజాగా ఫ్లోరిడాలోని ఒక న్యూస్ చానెల్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఆ చానల్ లో న్యూస్ ప్రజెంటర్ వాతావరణ వివరాలు చెబుతుండగా.. ఒక మహిళ నేరుగా స్టూడియోలోకి వచ్చేసింది. దీంతో యాంకర్ అండ్ సిబ్బంది షాక్ అయ్యి చూస్తుంటే.. ఆమె మాత్రం తానెక్కడ ఉన్నాను అన్న విషయం మరిచిపోయి మరీ మొబైల్ లో తెగ గేమ్ ఆడేస్తుంది. ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుంది ఆ గేమ్ పోకీమాన్ గో అని. ఈ గేమ్ లోని జాంబీ దెయ్యాని పట్టుకోవడానికి ఆమె అటు ఇటు చక్కర్లు కూడా కొట్టేస్తుంది. ఈమె చిత్రవిచిత్రాలకు బిత్తరపోయిన స్టూడియో సిబ్బంది ఆమెపై కసురుకోవడమే కాకుండా.. ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఈమె ప్రవర్తనను తలదన్నే స్థాయిలో మరో ఇద్దరు అమెరికన్లు ప్రవర్తించారు. పోకిమాన్ గో లో మునిగిపోయిన ఆ ఇద్దరు ఏ స్థాయిలో మైమరచిపోయారంటే.. ఈ ఆటాడుతూ ఆడుతూ కెనడా సరిహద్దులను సైతం దాటేశారట. దీంతో భద్రతా సిబ్బంది ఆ "ఆటగాళ్లను" అదుపులోకి తీసుకున్నారట! ఈ స్థాయిలో ఉంది పోకీమాన్ గో ప్రభావం.