Begin typing your search above and press return to search.
కేఏ పాల్ మెడకు బిగుసుకున్న ఉచ్చు
By: Tupaki Desk | 29 May 2019 6:11 AM GMTప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు - ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేఏ పాల్ అమెరికా పంపిస్తానంటూ తన దగ్గర డబ్బులు తీసుకొని పాల్ మోసం చేశాడంటూ సత్యవతి అనే మహిళ.. కేఏ పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ లోని బీహెచ్ ఈఎల్ కు చెందిన వ్యాపారవేత్త సత్యవతి. అమెరికా పంపిస్తానంటూ కేఏపాల్ రెండు లక్షల రూపాయల చెక్ ను కూడా తీసుకున్నట్టు మహిళ తెలిపింది. చెక్ తీసుకున్న తర్వాత తనకు స్పాన్సర్ షిప్ లెటర్ - ఇన్విటేషన్ కార్డు ఇచ్చారంటూ పోలీసులకు ఆధారాలు కూడా చూపించింది.
అయితే వీసా కోసం రెండు లక్షలు తీసుకున్న కేఏ పాల్ తనను అమెరికా పంపించడం లేదని సత్యవతి ఆరోపించింది. రూ. రెండు లక్షల రూపాయల చెక్ ను క్యాష్ చేసుకున్నంత వరకు మాట్లాడాడని.. డబ్బులు డ్రా చేసుకున్న అనంతరం పాల్ తన నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారని సత్యవతి ఆరోపించింది.
అయితే అనంతరం కేఏ పాల్ అడ్రస్ కనుక్కొని తాను వెళ్లానని.. నిలదీశానని సత్యవతి తెలిపింది. ఐదు లక్షల ఇస్తే వీసా ఇప్పిస్తానని లేకపోతే కుదరదని పాల్ చెప్పినట్టు తెలిపింది. అయితే బతిమిలాడితే రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరిందని వివరించింది.
అయితే 2లక్షలు చెల్లించిన తర్వాత కూడా కేఏ పాల్ అమెరికా పంపించలేదని సత్యవతి వాపోయింది. మరో 15 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని.. ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదని సత్యవతి తెలిపింది.
కేఏ పాల్ తన అసిస్టెంట్ జ్యోతి అనే యువతి పేరుతో చెక్ ఇవ్వాలని కోరాడని.. తను రూ.2 లక్షల చెక్ ఇచ్చానని సత్యవతి తెలిపింది. చెక్ తీసుకున్న తర్వాత పాల్ కేఏపాల్ ఫోన్ లిస్ట్ చేయలేదని.. పట్టించుకోలేదని తెలిపింది. దాంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అందుకే తనకు న్యాయం చేయాలని సత్యవతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. సత్యవతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 420 - 406 - రెడ్ విత్ 30 కింద కేఏ పాల్ పాల్ పై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. తనలాగే కేఏ పాల్ ఎంతమందిని మోసం చేశారో చెప్పాలని సత్యవతి డిమాండ్ చేశారు.