Begin typing your search above and press return to search.

వెజ్​ పిజ్జా.. అడిగితే నాన్​వెజ్​ ఇచ్చారు..! కస్టమర్​ ఏం చేసిందంటే..!

By:  Tupaki Desk   |   16 March 2021 5:33 AM GMT
వెజ్​ పిజ్జా.. అడిగితే నాన్​వెజ్​ ఇచ్చారు..! కస్టమర్​ ఏం చేసిందంటే..!
X
ఓ యువతి ఆమె కుటుంబం ప్యూర్​ వెజిటేరియన్లు.. పిజ్జా తినాలపించి వెజ్​ పిజ్జా ఆర్డర్​ చేసింది సదరు యువతి. కానీ సదరు రెస్టారెంట్​ ఆమెకు నాన్​వెజ్​ పిజ్జాను డెలివరీ చేసింది. వాళ్లు దాన్ని వెజ్​పిజ్జా అనుకొని తినేశారు.. ఆ తర్వాత అది నాన్​వెజ్​ పిజ్జా అని తేలింది. దీంతో సదరు యువతి కోర్టును ఆశ్రయించారు. తన మతవిశ్వాసాలను, కుటుంబ ఆచారాలను మంటగలిపినందుకు సదరు రెస్టారెంట్​ తమకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కోర్టులో కేసు వేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు సదరు రెస్టారెంట్​కు నోటీసులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

యూపీలోని ఘజియాబాద్‌ కు చెందిన దీపాళీ త్యాగి అనే మహిళ 2019 మార్చి 21న పిజ్జా కోసం ఆర్డర్‌ చేసింది. ఆ రోజు హోళీ కావడంతో కుటుంబ సభ్యులంతా హోళీ ఆడారు. ఆ తర్వాత పిల్లలకు ఆకలి కావడంతో సదరు యువతి దీపాళి త్యాగి ఓ రెస్టారెంట్ ​కు పిజ్జా ఆర్డర్​ చేసింది. అయితే ఆ రెస్టారెంట్ మాత్రం నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది దీంతో సదరు యువతి ఆర్డర్​ చేసిన పిజ్జాను అందరూ తినేశారు.

ఇప్పుడా యువతి లాయర్‌ సహాయంతో వినియోగదారుల కోర్టుకెక్కింది. అమెరికా పిజ్జా కంపెనీ తన మత విశ్వాసాలను దెబ్బతీసిందని వాదించింది. దీనిపై కోర్టు పిజ్జా కంపెనీని వివరణ కోరింది. తదుపరి విచారణ మార్చి 17న జరుగనుంది. సదరు కంపెనీ తనకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆ మహిళ వాదిస్తున్నది. ఆ రెస్టారెంట్​ చేసిన తప్పుడు పని వల్ల తమ ఆచార సంప్రాదాయలు మంటగలిసాయని ఆమె అంటున్నారు.