Begin typing your search above and press return to search.

కిరాత‌కం: కూతురు ల‌వ్వ‌ర్ త‌ల్లిపై గ్యాంగ్ రేప్‌

By:  Tupaki Desk   |   31 Dec 2017 4:22 AM GMT
కిరాత‌కం: కూతురు ల‌వ్వ‌ర్ త‌ల్లిపై గ్యాంగ్ రేప్‌
X
ఏమైపోతున్నాం.. ఎక్క‌డికి పోతున్నామో అర్థం కాని దుస్థితి. నాగ‌రిక స‌మాజంలోకి అడుగులు వేస్తున్నామ‌ని చెబుతూనే.. అనాగ‌రికంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఈ డిజిట‌ల్ యుగంలో అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఈ రోజుల్లో ప్రేమ విష‌యంలో ఇంత దారుణంగా.. దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. అనాగ‌రిక స‌మాజంలో కూడా ఇలాంటివి ఉంటాయా? అన్న సందేహాన్ని క‌లిగించే దారుణ ఘ‌ట‌న ఒక‌టి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది.

కూతురు ప్రేమించిన కుర్రాడిపై ప‌గ తీర్చుకునేందుకు చేసిన దుర్మార్గం ఆ రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. ప్రేమించి.. ర‌హ‌స్యంగా వెళ్లిపోయార‌న్న కోపంతో యువ‌కుడి త‌ల్లిపై గ్యాంగ్ రేప్ అకృత్యానికి తెగ‌బ‌డ్డారు. ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ జిల్లా భోపుర‌కు చెందిన యువ‌తి.. నోజ‌ల్ గ్రామానికి చెందిన యువ‌కుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ‌కు పెద్దోళ్లు నో చెప్పేశారు.

దీంతో.. పెద్దోళ్ల‌కు చెప్ప‌కుండా ప్రేమికులు ఇద్ద‌రు ర‌హ‌స్యంగా పారిపోయారు. దీంతో యువ‌తి కుటుంబ స‌భ్యులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. యువ‌కుడి ఇంటికి వెళ్లిన యువ‌తి కుటుంబ స‌భ్యులు.. వారిని త‌మ గ్రామంలోని ఒక ఇంట్లో బంధించారు. ఆ యువ‌కుడి త‌ల్లిపై యువ‌తి తండ్రి.. అత‌ని ఇద్ద‌రు సోద‌రులు.. మాజీ గ్రామ ప్ర‌ధాన్‌.. అత‌ని కొడుకు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. త‌న కుమార్తెను ప్రేమించి.. లేవ‌దీసుకెళ్లిపోయార‌న్న ఆగ్ర‌హంతో ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం అక్క‌డ సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు కేసు న‌మోదు చేసి.. విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ఆరాచ‌క ఘ‌ట‌న‌పై ప‌లువురు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.