Begin typing your search above and press return to search.

త‌ప్పుడు రేప్ కేస్‌..మ‌హిళ‌కు ఏడేళ్ల జైలు

By:  Tupaki Desk   |   7 May 2017 7:15 AM GMT
త‌ప్పుడు రేప్ కేస్‌..మ‌హిళ‌కు ఏడేళ్ల జైలు
X
అత్యంత‌ హేయ‌మైన చ‌ర్య‌గా భావించే అత్యాచారం ఉదంతాల్లో భిన్న‌మైన సంఘ‌ట‌న ఇది. తప్పుడు రేప్ కేసిన పెట్టిన ఓ మ‌హిళ జైలు శిక్ష రూపంలో త‌గు శిక్ష‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. హర్యానాలోని రోహ్‌ తక్ జిల్లాకు చెందిన‌ ఓ మ‌హిళ‌ తనపై కొందరు లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అనంత‌రం స‌ద‌రు విచార‌ణ కోర్టు గుమ్మం ఎక్కింది. వాదోప‌వాదాల సంద‌ర్భంగాఆ మహిళ తప్పుడు కేసు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో స‌ద‌రు మ‌హిళను న్యాయ‌స్థానం దోషిగా తేల్చింది.

రోహ్‌ తక్ జిల్లాకు చెందిన మీనాక్షి (28) 2010 జూన్‌ లో ఎనిమిది మందిపై గ్యాంగ్‌ రేప్ కేసు పెట్టింది. ఏడేళ్ల‌ క్రితం కొందరు వారి కారులో తనపై సాముహిక లైంగికదాడికి పాల్పడ్డారని మీనాక్షి ఆరోపించారు. తర్వాత అందులో ఒకరు తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. వివాహం జ‌రిగిన తర్వాత భర్తతోపాటు అన్నదమ్ములు లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 17మంది చెప్పిన సాక్షాలను పరిశీలించిన రోహ్‌ తక్ అడిషనల్ సెషన్స్ కోర్టు మీనాక్షి తప్పుడు కేసు పెట్టినట్లు ధ్రువీకరించింది. ఆమెకు ఏడేండ్ల జైలుశిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు. మీనాక్షి ఉద్దేశపూర్వకంగా తన భర్త, కుటుంబసభ్యులపై తప్పుడు సాక్ష్యం ఇచ్చినట్లు కేసు విచారణలో రుజువైందని రోహ్‌ తక్ అడిషనల్ సెషన్స్ జడ్జీ వైకే బెహ్ల్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/