Begin typing your search above and press return to search.

ఆమెకు దొరికిన ఎంపీలు పాతిక‌మంద‌ట‌

By:  Tupaki Desk   |   4 May 2017 6:51 AM GMT
ఆమెకు దొరికిన ఎంపీలు పాతిక‌మంద‌ట‌
X
ఆ మ‌ధ్య‌న ఒక ఎంపీ త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. కావాలంటే ఫోటోలు చూడ‌మంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన మ‌హిళ ఉదంతం తెలిసిందే. అయితే.. స‌ద‌రు ఎంపీ త‌న‌కు ఎదురైన అవ‌స్థ గురించి పోలీసుల‌కు వివ‌రించ‌టంతో ఈ మాయ‌లేడీలోని మ‌రో కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనంత‌రం ఆమె కోసం గాలింపులు జ‌రిపి.. అరెస్ట్ చేసిన పోలీసులు.. విచార‌ణ జ‌ర‌ప‌గా వారికి షాకుల మీద షాకులిస్తూ ఆమె వెల్ల‌డించిన స‌మాచారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఉన్న‌త చ‌దువులు చ‌దివిన స‌ద‌రు మ‌హిళ ఎట్టి ప‌రిస్థితుల్లో ఐఏఎస్ కావాల‌ని క‌ల‌లు కంది. కుద‌ర్లేదు. క‌నీసం.. రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ ఉద్యోగ‌మైనా సాధించాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీంతో నిరాశ‌కు గురైన ఆమె.. వ‌క్ర‌మార్గంలో ప‌య‌నించింది. ఎంపీల‌ను మాయ చేస్తూ.. వారి ద‌గ్గ‌ర డ‌బ్బులు దండుకునే ప‌నిని షురూ చేసింది. ప‌థ‌కం ప్ర‌కారం ఎంపీని ట్రాప్ చేసి.. వారిని మ‌త్తులోకి దించి అస‌భ్య‌క‌ర ఫోటోలు తీసి.. బెదిరించి సొమ్ము చేసే ప‌నిని షురూ చేసింది.

త‌న‌కు న్యాయ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఎంపీల‌కు ఫోన్ చేయ‌టం.. వారిని క‌ల‌వ‌టం.. ఆ త‌ర్వాత వారితో ప‌రిచ‌యం పెంచుకొని.. మాట్లాడేందుకు ఇంటికి ర‌మ్మ‌ని ఆహ్వానించ‌టం.. లేదంటే భోజ‌నానికి రావాల‌ని కోర‌టం చేస్తుంది. న‌మ్మి ఇంటికి వెళితే అంతే సంగ‌తులు. మ‌ర్యాద‌ల పేరుతో మ‌త్తు మందు ఇచ్చే ఆమె.. స‌ద‌రు ఎంపీతో అస‌భ్య‌క‌ర ఫోజుల‌తో ఫోటోలు దిగి.. వారిని బెదిరించి డ‌బ్బులు దండుకోవ‌టం షురూ చేస్తుంది. ఇలా ఇప్ప‌టివ‌ర‌కూ ఆమెకు బుక్ అయిన ఎంపీలు పాతిక‌మంది వ‌ర‌కూ ఉన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆమెకు బుక్ అయిన ఎంపీల జాబితాను చూస్తే షాకింగ్ గా అనిపించ‌క మాన‌దు. పేరుప్ర‌ఖ్యాతులున్న ఎంపీలు కూడా బాధితులుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం హ‌రీశ్ రావ‌త్‌.. ఎంపీ షాదీలాల్ బాట్రా.. కేసీ ప‌టేల్ త‌దిత‌రులు ఉన్నారు. ఈ కిలేడీ ఇంటిని ప‌రిశీలించిన పోలీసుల‌కు దిమ్మ తిరిగే విష‌యాన్ని గుర్తించారు. ఆమె బెడ్రూంలో పాతిక కెమేరాలు ఉన్న‌ట్లుగా తేల్చారు. ఎవ‌రైనా ఆ గ‌దిలోకి ప్ర‌వేశించిన క్ష‌ణం నుంచి ఏ యాంగిల్ లో అయినా స్ప‌ష్టంగా ఫోటోలు తీసేందుకు వీలుగా కెమేరాలు అమ‌ర్చారు. ఆమె వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వ‌చ్చే మ‌హిళ‌ల విష‌యంలోనూ.. ఇళ్ల‌కు అతిధ్యం కోసం ఆహ్వానించే మ‌హిళ‌ల విష‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది సుమి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/