Begin typing your search above and press return to search.

ఆస్త్రేలియాలో ఇండియన్ ఫ్యామిలీకి చేదు అనుభవం

By:  Tupaki Desk   |   3 May 2017 4:30 PM GMT
ఆస్త్రేలియాలో ఇండియన్ ఫ్యామిలీకి చేదు అనుభవం
X
ఈ మధ్య జాతి వివక్ష అనగానే అందరికీ అమెరికానే గుర్తుకొస్తోంది. ఐతే ఈ విషయంలో వేరే దేశాల వాళ్లు కూడా తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో భారతీయ కుటుంబానికి అవమానం ఎదురైంది. ఉత్స‌వ్ ప‌టేల్ అనే ప్ర‌వాస భార‌తీయుడు.. సిడ్నీలోని ఓ పార్కులో బెంచీపై గ‌ర్భ‌వ‌తి అయిన త‌న భార్య‌కు కాస్త కూర్చునే అవ‌కాశ‌మిస్తారా అని అడ‌గ‌డ‌మే పాపం అయిపోయింది.

సిడ్నీకి చెందిన ఓ మ‌హిళ ఇలా అడిగినందుకు ఉత్స‌వ్ ప‌టేల్.. అత‌డి భార్య‌ను దుర్భాష‌లాడింది. జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసింది. అవ‌మాన‌క‌రంగా మాట్లాడింది. అస‌భ్య‌క‌ర సంజ్న‌లు చేసింది.

వారి నాలుగేళ్ల కూతురు భయంతో చూస్తుండగా ..ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అక్క‌డ జ‌రిగిన మొత్తం వ్య‌వ‌హారాన్ని ఉత్స‌వ్ ప‌టేల్ వీడియో తీశాడు.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఏప్రిల్‌ 22న సిడ్నీలోని లూనా పార్క్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉత్సవ్‌ పార్కులో రైడింగ్‌ చేసేందుకు తన నాలుగేళ్ల కూతురితో క‌లిసి వెళ్లాడు. త‌మ వెంట భార్యను కూడా తీసుకెళ్లాడు. అయితే తన భార్య గర్భవతి కావడంతో బెంచీపై కూర్చోబెట్టాలని అనుకున్నాడు. అప్పటికే బెంచీపై ఓ ఆస్ట్రేలియన్‌ మహిళ ఉండగా కాస్త చోటివ్వ‌మ‌ని అడిగాడు. ఈ మాత్రానికే ఆమె అనకూడని మాటలు అనేసింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. గో..గో..గో అంటూ గోల చేసింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/