Begin typing your search above and press return to search.
ఫ్రాక్ వేసుకుంటే ఇండిగోలో నో ఎంట్రీనా?
By: Tupaki Desk | 29 Oct 2015 10:30 PM GMTవిమానంలో ఎక్కాలంటే డ్రెస్ కోడ్ ఉంటుందా? ఫలానా దుస్తులు ధరించిన వారే విమానం ఎక్కే వీలుందని.. ఫలానా తరహా దుస్తులు ధరించిన వారికి విమాన ప్రయాణానికి అనుమతించరన్న విషయం తెలుసా? నిజానికి ఫ్లైట్ ఎక్కేందుకు డ్రెస్ కోడ్ ఉంటుందన్న షాకింగ్ విషయం ఇండిగో చెప్పటం ఇప్పుడు చర్చగా మారింది. ఒక ప్రయాణికురాలు ఫ్రాక్ ధరించిందన్న కారణంగా ఆమె డ్రెస్ మార్చుకొని వచ్చే వరకూ ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని వైనం ఇప్పుడు పెద్ద చర్చకే తెర తీసింది. డ్రెస్ కోడ్ పేరుతో ఒక ప్రయాణికురాలి విషయంలో ఇండిగో వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పురబిదాస్ అనే ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్ పేజీలో ఇండిగో విమాన సంస్థ తీరును తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. దీని ప్రకారం ఒక ప్రయాణికురాలు ఖతార్ ఎయిర్‌వేస్ కు చెందిన ఫ్లైట్‌లో దోహా నుంచి ముంబయికి వచ్చారు. అక్కడి నుంచి ఆమె ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కనెక్టివ్ ఫ్లైట్ కోసం వేచి చూసిన ఆమె.. ఇండిగో విమానంలో ఎక్కారు. సదరు ప్రయాణికురాలు మోకాళ్ల వరకున్న ఫ్రాక్ ధరించారు. సరిగ్గా చెప్పాలంటే విమానంలో ఎయిర్ హోస్టెస్ ధరించే మాదిరి లాంటిది ప్రయాణికురాలు ధరించారు. ఆమె ధరించిన దుస్తులు విమాన డ్రెస్ కోడ్ కు సరిపోయేలా లేదని.. దుస్తులు మార్చుకు రావాలని ఇండిగో సంస్థకు చెందిన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.
తన సహ ప్రయాణికురాలి విషయంలో ఇండిగో సిబ్బంది వ్యవహరించిన తీరుపై పురబిదాస్ ఆందోళన చెందారు. అనంతరం ఆమె.. ఇండిగో కస్టమర్ కేర్ ను ఈ విషయంపై సంప్రదించగా.. ఫ్రాక్ వేసుకొన్న ప్రయాణికుల్ని తమ విమానంలో అనుమతించమని పేర్కొనటంతో అవాక్కు కావటం పురబిదాస్ వంతైంది. ఇక.. సదరు ప్రయాణికురాలి సంగతికి వస్తే.. ఆమె దుస్తులు మార్చుకొని వచ్చేసరికి విమానం మిస్ అయ్యారని.. అనంతరం వేరే విమానంలో ఆమెను పంపినట్లుగా పురబిదాస్ వెల్లడించారు. సో.. ఇండిగో విమానం ఎక్కేవారు ఫ్రాక్ ధరించకూడదన్న మాట.