Begin typing your search above and press return to search.

ప్రియుడిని చంపి బిర్యానీ చేసుకుతింది..

By:  Tupaki Desk   |   22 Nov 2018 10:59 AM GMT
ప్రియుడిని చంపి బిర్యానీ చేసుకుతింది..
X
టీవీలు వచ్చాక నేరాలు పెరిగిపోయాయి..నేరాలు-ఘోరాలు లాంటి ప్రోగ్రాములు - సీఐడీ లాంటి టీవీ ప్రోగ్రాం చూసి చాలా మంది చట్టానికి దొరక్కకుండా నేరాలు చేస్తున్నారు. ఈ కొత్త తరహా నేరాల కోసం టెక్నాలజీని ఉపయోగించుకొని దొరక్కుండా తప్పించుకుంటున్నారు. పోలీసులకు కూడా చిక్కకుండా వ్యవహరిస్తున్నారు.

తాజాగా నేరాలు చేయడంలో పురుషులే కాదు.. మహిళలు ఆరితేరి పోయారు. మొరాకో దేశంలో ఓ యువతి ఏడేళ్లుగా ప్రేమించిన అబ్బాయి.. తనను వదిలేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు రెడీ కావడంతో తట్టుకోలేకపోయింది. ఇంటికి చివరిసారిగా పిలిచింది. దీంతో మాజీ ప్రియురాలు ఏదైనా ట్రీట్ ఇస్తుందని ఆశపడి లవర్ వచ్చేశాడు. మాటల్లో దింపి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత మరణించిన లవర్ దేహాన్ని రాక్షసంగా ముక్కలుగా కోసి మసాలా దట్టించి బిర్యానీ చేసింది. అదే బిర్యానీని తన ఇంటి దగ్గర పనిచేస్తున్న పాకిస్తానీయులకు పంచిపెట్టింది. వారు కొత్తరకం బిర్యానీ అని తెగ లాగించేశారట..

ఇక చనిపోయిన లవర్ వెళుతూ వెళుతూ మాజీ ప్రియురాలు ఇంటికి వెళుతున్నానని తన తమ్ముడికి చెప్పి వెళ్లాడట.. దీంతో సోదరుడి కోసం యువతి ఇంటికి వెళ్లాడు తమ్ముడు. కానీ బయటకు వెళ్లిపోయాడని మాజీ లవర్ చెప్పడంతో ఇతర చోట్ల కూడా సోదరుడు వెతికాడు. ప్రియురాలిపై అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇంట్లో బిర్యానీలో తన సోదరుడి బంగారు పన్ను కనిపించింది. దీంతో హత్య చేసి బిర్యానీ చేసుకుందని షాక్ అయిన సోదరుడు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవయవాలకు డీఎన్ఏ టెస్ట్ చేయంగా.. మృతుడి వివరాలు బయటపడ్డాయి. తనను కాదన్నందుకు ప్రియుడినే చంపి బిర్యానీ చేసుకున్న యువతి ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.