Begin typing your search above and press return to search.

పంచాయతీ కార్యాలయానికి మహిళ తాళం.. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   4 July 2021 4:30 AM GMT
పంచాయతీ కార్యాలయానికి మహిళ తాళం.. కారణం ఇదే!
X
వాస్త‌వానికి మెజారిటీ అధికారాలు ప‌ల్లెల‌కే కేటాయించాల‌ని, ప్ర‌ధాన‌మైన అధికారాల‌ను మాత్ర‌మే ప్ర‌భుత్వాలు త‌మ వ‌ద్ద ఉంచుకోవాల‌నే డిమాండ్ ఉంది. 73, 74 రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు సైతం ఇదే చెబుతున్నాయి. పంచాయతీలకు అధికారాలను బదిలీ చేయాలని, తద్వారనే అభివృద్ధి సాధ్య‌వ‌వుతుంద‌ని వివ‌రిస్తున్నాయి. కానీ.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌ట్లేదు.

దీంతో.. ప‌ల్లెలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ద‌య‌త‌ల‌చి విదిల్చితే త‌ప్ప‌.. గ్రామ పంచాయ‌తీ గ‌ల్లా పెట్టెలోకి రూపాయి చేర‌ట్లేదు. ఇక‌, ప‌ల్లెసీమ‌లు అభివృద్ధి చెందేదెప్పుడు..? త‌ద్వారా దేశం అభివృద్ధి చెందిన దేశాల‌ జాబితాలో చేరేది ఎప్పుడు..?

పై ఫొటోలో క‌నిపిస్తున్న‌ది ప్రకాశం జిల్లాలోని కొమ‌రోలు మండ‌లం న‌ల్ల‌గుంట్ల గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యం. అక్క‌డ ఏం జ‌రుగుతోందంటే.. గ్రామ‌ స‌చివాల‌యానికి తాళం వేస్తున్నారు. కార‌ణం ఏమంటే.. అది ప్రైవేటు భ‌వ‌నం. మ‌రి, ఆ భ‌వ‌నం వాడుకుంటున్న‌ప్పుడు అద్దె చెల్లించాలి క‌దా? అది చెల్లించ‌ట్లేదు. అందుకే.. విసిగిపోయిన య‌జ‌మాని తాళం వేసేశారు.

అద్దె చెల్లించిన‌ప్పుడే తాళం మీ చేతిలో పెడ‌తాన‌ని చెప్పేశారు. క‌నీసం.. తన నీడ కోసం ఓ భ‌వ‌నం నిర్మించుకోలేని ఈ పంచాయ‌తీ.. చివ‌ర‌కు అద్దె కూడా చెల్లించుకోలేని ఈ స‌చివాల‌యం.. ఇక‌, గ్రామ ప్ర‌జ‌ల‌ను స‌ర్వోన్న‌తంగా ఎలా అభివృద్ది చేస్తుంది? ఇదొక్క‌టేకాదు.. రాష్ట్రంలోని చాలా పంచాయ‌తీల ప‌రిస్థితి ఇదే. మ‌రి, దీనికి పాల‌కులు ఏం స‌మాధానం చెబుతారో?