Begin typing your search above and press return to search.
బికినీ ఎఫెక్ట్...తల్లి నుంచి బిడ్డను వేరే చేసిన కోర్టు తీర్పు!
By: Tupaki Desk | 19 July 2019 10:25 AM GMTఓకే బికినీ ఓ బిడ్డను తల్లి నుంచి వేరు చేసింది. కేవలం ఆ తల్లి వస్త్రధారణ కారణంగా ఆ తల్లికి తన బిడ్డపై ఎలాంటి అధికారాలు లేకుండా కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొన్నేళ్ళ క్రితం అమెరికాకు చెందిన బెతని వియేరా అనే మహిళకు సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యాపారి తో వివాహమైంది. కొన్నేళ్ళ పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. అమెరికాలో పుట్టి పెరిగిన బెతనీకి పశ్చాత్య దేశపు అలవాట్లు ఎక్కువ. ఆమె చాలా మోడ్రన్ అమ్మాయిగా జీవనం కొనసాగిస్తుంది.
ఈ క్రమంలోనే భర్తతో ఆమెకు ఏర్పడిన విభేదాలు పెద్దవిగా మారి చివరకు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లాయి. సౌదీ కోర్టు ఈ భార్య భర్తలకు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బెతనీ తన నాలుగేళ్ల కుమార్తెను కూడా తనకే ఇవ్వాలని మళ్లీ కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు మాత్రం ఆమె నాలుగేళ్ల కుమార్తె జీనా బాధ్యతలు తండ్రికే అప్పగిస్తూ తీర్పు ఇవ్వడంతో బెతనీ కుప్పకూలిపోయింది.
ఇంతకు కోర్టు ఆ బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తూ తీర్పు ఇవ్వడం వెనక ఓ బికినీయే. ఆమె ఓ బికినీతో ఉన్న ఫొటోను మాజీ భర్త కోర్టుకు సమర్పించారు. దీంతో పాశ్చాత్య దేశపు అలవాట్లు ఉన్న బెతనీ కంటే జీనా తండ్రి దగ్గర ఉంటేనే సౌదీ సంప్రదాయాలతో పెరుగుతుందని భావించిన కోర్టు బిడ్డ సంరక్షణ బాధ్యత తండ్రికే అప్పగించింది. తమ దేశ సంస్కృతి - సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది.
అదే టైంలో ఆమె తన మాజీ భర్త డ్రగ్స్ అమ్ముతున్నాడని బెతనీ ఆరోపించినా కోర్టు పట్టించుకోలేదు. ఆ భర్త మాత్రం తన మాజీ భార్య బికినీలు వేసుకుని యోగా నేర్పుతుందని... బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సైతం బురఖా వేసుకోవడం లేదని తెలిపాడు. అయితే తాను బికినీ వేసుకున్న ఫోటోలు అమెరికాలో ఉన్న సమయంలో తీసినవి అని... అవి కూడా తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి తీసి కోర్టుకు ఇచ్చాడని బెతనీ భోరున విలపించింది. అయినా కోర్టు మాత్రం ఆమె మెర ఆలకించలేదు.