Begin typing your search above and press return to search.

క్యాబ్ ​లో మహిళ అనుచిత ప్రవర్తన.. 16 ఏళ్ల జైలు, మూడువేల డాలర్ల ఫైన్​..!

By:  Tupaki Desk   |   20 March 2021 4:00 AM GMT
క్యాబ్ ​లో మహిళ అనుచిత ప్రవర్తన.. 16 ఏళ్ల జైలు, మూడువేల డాలర్ల ఫైన్​..!
X
కరోనా ఎఫెక్ట్​తో మాస్కులు ధరించడం అనివార్యమైంది. అన్నిదేశాలు మాస్కులను ధరించడం ఓ నిబంధనగా పెట్టాయి. అయితే చాలా మంది విధిగా మాస్కులు ధరిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం మాస్కులు పెట్టుకోమంటూ నానా యాగీ చేస్తున్నారు. తాజా ఓ మహిళ మాస్కు పెట్టుకోండి.. అన్నందుకు క్యాబ్​ డ్రైవర్​ పై అరిచింది.. అతడి మాస్కు కూడా తీసేసి అతడి మీద నోటి తుంపర్లు పడేలా దగ్గింది. అంతేకాక క్యాబ్​ డ్రైవర్​ పై జాతి వివక్షతో కూడిన ఆరోపణలు చేసింది. అతడి మీద పెప్పర్​ స్ప్రే చల్లింది. పైగా క్యాబ్​ డ్రైవర్​ మీదే తప్పుడు కేసులు పెట్టింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన అర్నా కిమియా నిన్న మధ్యాహ్నం బేవ్యూలో ఓ ఊబర్​ కారులో ఎక్కింది. ఆ కారును దక్షిణాసియాకు చెందిన సుభాకర్​ అనే డ్రైవర్​ నడుపుతున్నాడు. ఆ కారులో కిమియాతో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే కిమియా మాస్క్​ ధరించకుండా కారులోకి ఎక్కింది. దీంతో సదరు డ్రైవర్​ మాస్క్​ ధరించాలని ఆమెను కోరాడు. దీనికి కిమియా ఇంతెత్తున ఎగిరిపడింది. ‘నన్నే మాస్కు పెట్టుకోమంటావా జాతి తక్కువ... ’ అంటూ ఇష్ట మొచ్చినట్టు తిట్టింది. అంతటితో ఊరుకోలేదు. డ్రైవర్​ మాస్కును కూడా తీసేసింది. అతడిపైకి వెళ్లి దగ్గింది. అప్పటికీ ఆమె కోపం చల్లారలేదు. సదరు డ్రైవర్​ పై పెప్పర్​ స్ప్రేను ప్రయోగించింది. ఆ ఘటన మొత్తాన్ని అదే కారు లో ఉన్న ఒకరు వీడియో తీసారు.

అయితే కిమియా వెళ్లి పోలీసులకు సదరు క్యాబ్​ డ్రైవర్​ పైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గర ఉన్న డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించాడని సదరు డ్రైవర్​ పై కేసు పెట్టింది. అయితే ఈ కేసును సీరియస్​ గా తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. వీడియో సాక్ష్యాలు పరిశీలించాక తప్పంతా కిమియాదే నని తేల్చారు. దీంతో వెంటనే విచారణ చేపట్టిన కోర్టు .. కిమియా కోవిడ్​ నిబంధనలు ఉల్లంఘించినట్టు సాక్ష్యాలు దొరకడంతో ఆమెకు 16 సంవత్సరాలు జైలు శిక్ష, మూడు వేల డాలర్ల ఫైన్​ విధించింది.