Begin typing your search above and press return to search.
పార్టీ కార్యకర్తను పెళ్లాడిన మహిళా ఎమ్మెల్యే
By: Tupaki Desk | 8 Oct 2022 5:02 AM GMTదేశంలోని సగటు రాజకీయ పార్టీలకు కాస్త భిన్నంగా ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ పార్టీ.. అంచనాలకు మించిన ఢిల్లీ రాష్ట్రంలో పాగా వేయటమే కాదు.. వరుస పెట్టి అధికారాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఢిల్లీ ఫార్ములాను పంజాబ్ లోనూ అమలు చేస్తామన్న హామీతో.. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేయటం తెలిసిందే. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే వివాహం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం.. ఆమె ఎంచుకున్న పెళ్లి కుమారుడే.
సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నంతనే.. వారి రేంజ్ ఒక్కసారిగా మారిపోవటం మనం చూస్తుంటాం. అందునా ఒక మహిళా ఎమ్మెల్యే పెళ్లి.. మరో పెద్ద పారిశ్రామికవేత్తతో కానీ.. ఇంకేదైనా పేరు ప్రఖ్యాతులున్న వారిని పెళ్లాడతారు. కానీ.. ఆమ్ ఆద్మీ మహిళా ఎమ్మెల్యే నరిందర్ కౌర్ భరాజ్ మాత్రం కాస్తంత భిన్నంగా వ్యవహరించారు.
తమ పార్టీకి చెందిన కార్యకర్తను ఆమె పెళ్లాడారు. వీరి వివాహానికి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యారు. కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు.
ఇక్కడ నరిందర్ కౌర్ భరాజ్ గురించి కాస్తంత చెప్పుకోవాలి. 28 ఏళ్ల ఈ మహిళా ఎమ్మెల్యే.. పంజాబ్ లో అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రికార్డును తన పేరున లిఖించుకున్నారు. సంగ్రూర్ లోని భరాజ్ విలేజ్ లో ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆమె.. పటియాలాలోని పంజాబ్ వర్సిటీలో ఎల్ఎల్ బీ చదివారు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ బూత్ ను ఏర్పాటు చేయటం ద్వారా పార్టీ పెద్దల కళ్లల్లో పడ్డారు. అనంతరం భగవంత్ మాన్ ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల మీద ఫోకస్ చేశారు. ఆమె కమిట్ మెంట్.. పని తీరుకు మెచ్చిన పార్టీ ఆమెకు ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చారు.
ఆమె ప్రయత్నానికి తగ్గట్లే.. ఆమె ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా తన భర్తగా ఎంపిక చేసుకున్న మణ్ దీప్ సింగ్ విషయానికి వస్తే.. అతగాడు ఆమ్ ఆద్మీ పార్టీ సంగ్రూర్ జిల్లాకు మీడియా ఇంఛార్జ్ గా పని చేశారు. రోటీన్ కు భిన్నంగా పార్టీ కార్యకర్తను పెళ్లాడిన పార్టీ ఎమ్మెల్యే ఉదంతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.