Begin typing your search above and press return to search.
బుర్జ్ ఖలీఫాపై మహిళ…ఆ ఎయిర్ లైన్స్ యాడ్ వీడియో వైరల్ !
By: Tupaki Desk | 11 Aug 2021 4:54 AM GMTయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే అతి పెద్దదైన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఎవరూ ఊహించలేని , అద్భుతమైన యాడ్ ని తయారుచేసింది. దుబాయ్ లోని అతి ఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై మహిళ నిలబడి తమ సంస్థ ప్రమోషన్ కి సహకరిస్తున్న యాడ్ కావడం విశేషం. 30 సెకండ్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ స్కై డైవింగ్ ఇన్స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్ లుడ్ విక్ ఈ యాడ్ లో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ క్రూ మెంబర్ గా అదే యూనిఫామ్ తో కనిపిచింది. ఫ్లై ఎమిరేట్స్, ఫ్లై బెటర్ అని రాసి ఉన్న మెసేజ్ బోర్డులు పట్టుకుని చిరునవ్వుతో కనిపించిన ఈమె అచ్ఛు విమాన సిబ్బందిలో ఒకరనే అభిప్రాయానికి తావిచ్చింది.
ప్రపంచంలోనే ఎత్తయిన బిల్డింగ్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఓ అమ్మాయిని నిలబెట్టి ఈ యాడ్ షూటింగ్ చేయడం విశేషం. ఈ 30 సెకన్ల యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్-లుడ్విక్ ఈ యాడ్‌లో కనిపించింది. భూమినుంచి 828 మీటర్ల ఎత్తయిన బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తయిన కట్టడంగా పాపులర్ అయింది. తాను చేసిన స్టంట్లలో ఇది అద్భుతమైనదని నికోల్ తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. ఇప్పటివరకు ఇలాంటి సాహసాన్ని చేయలేదని ఆమె తెలిపింది. మీ క్రియేటివిటీ మార్కెటింగ్ ఐడియాకు నా జోహార్లు అని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ని ఆమె ప్రశంసించింది.
ఈ బృందంలో తాను కూడా భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నానని ఆమె వెల్లడించింది. బహుశా ఈ విధమైన ఐడియా మరే వైమానిక సంస్థకూ వచ్చి ఉండదని భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ని, ఈ మహిళను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ యాడ్‌ను ఎలా చిత్రీకరించారు? దీని కోసం ఎంత ప్రయాస పడ్డారో మరో వీడియోలో ఎమిరేట్స్ చూపించింది. నికోల్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. 828 మీటర్ల ఎత్తుతో భూమిపై అతి ఎత్తయిన భవనంగా బుర్జ్ ఖలీఫాకు పేరుంది.