Begin typing your search above and press return to search.
కొడుకు ప్రేమపెళ్లి ఆమెనిఎలా అవమానించారంటే?
By: Tupaki Desk | 13 Nov 2015 12:25 PM GMTకొడుకు తీసుకున్న నిర్ణయం.. ఆ తల్లికి దారుణమైన అవమానానికి గురి చేయటమే కాదు.. తీరని మనోవ్యధకు గురి చేయటంతో పాటు.. ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అత్యంత అనాగరికంగా వ్యవహరించిన ఈ ఘటన విన్న వారంతా షాక్ కు గురయ్యే పరిస్థితి. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ నాగరిక ఘటన విన్న వారి నోట మాట రాని పరిస్థితి.
మధ్యప్రదేశ్ లోని లాహర్ పట్టణానికి చెందిన ఒక యువకుడు.. స్థానికంగా మురళీదౌర్ ఫ్యామిలీకి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అయితే.. వీరి ప్రేమకు.. అమ్మాయి తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. దీంతో.. పోలీసుల్ని ఆశ్రయించి.. కోర్టు ఆదేశాలతో ఈ కుర్రాడు.. గత ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆ కుర్రాడి కుటుంబాన్ని దెబ్బ తీయాలని భావించిన అమ్మాయి తల్లిదండ్రులు ఒక దారుణానికి పాల్పడ్డారు.
తాజాగా సదరు కుర్రాడికి ఇంటికి వెళ్లిన యువతి కుటుంబీకులు.. యువకుడి సోదరుడ్ని తీవ్రంగా గాయపర్చారు. అనంతరం ఆ యువకుడి తల్లిని దాడి చేశారు. అనంతరం.. ఆమె జుట్టును కత్తిరించటంతో పాటు.. ఆమెను నగ్నంగా చేసి.. రెండు గంటల పాటు ఊరంతా ఊరేగించి అత్యంత అనాగరికంగా వ్యవహరించారు. వారి దాడితో ఆ తల్లి తీవ్రంగా గాయపడి.. విషమ పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం గ్వాలియర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ దారునానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం ఈ అనాగరిక ఘటనకు కారణమైన వారి కోసం వెతుకుతున్నారు. కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే.. ఆ తల్లి పట్ల అంత అనాగరికంగా వ్యవహరించాలా..?