Begin typing your search above and press return to search.

అదిరిపోయే సినిమా సీన్ లా ఆ అమ్మడి ప్రపోజల్

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:53 AM GMT
అదిరిపోయే సినిమా సీన్ లా ఆ అమ్మడి ప్రపోజల్
X
సినిమా టిక్ గా ఉండటమే కాదు.. ఒక రొమాంటిక్ మూవీలో అదిరిపోయే సీన్ కు సరిపోయే వెరైటీ లవ్ ప్రపోజల్ ఒకటి చైనాలో చోటుచేసుకుంది. వందలాది మంది ముందు తన ప్రేమను నిస్సంకోచంగా వ్యక్తపర్చటమే కాదు.. ఆమె లాంటి లవ్వర్ తమకుంటే ఎంతబాగుండో అన్న భావన లక్షలాది మందిలో కలుగచేసేని ఉదంతమిది.

ప్రపంచంలో కోట్ల మంది ప్రేమికులు ఉన్నా.. ఇలాంటి ప్రేయసి మాత్రం చాలా అరుదుగా ఉంటారన్న భావన కలిగించే ఈ వ్యవహారంలోకి వెళితే.. చాలా జంటల మాదిరే చైనాలో ఒక అబ్బాయి.. ఒక అబ్బాయి ఫ్రెండ్స్ గా ఉన్నారు. వారి మధ్య ఆత్మీయత స్థాయి పెరిగింది. ఆ అబ్బాయిని సదరు అమ్మాయి విపరీతంగా ప్రేమించేసింది. అబ్బాయి కంటే ముందు ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోయి తన ప్రేమను వ్యక్తం చేయాలనుకుంది. సాదాసీదాగా చేస్తే ఏం బాగుంటుందని అనుకుందో ఏమో కానీ.. వెరైటీగా ప్రపోజ్ చేయాలని భావించింది. దీనికి తగ్గట్లే ఒక షాపింగ్ మాల్ దగ్గరకు రావాలంటూ బాయ్ ఫ్రెండ్ కు చెప్పింది.

ఎప్పటిమాదిరే మీటింగేనని భావించిన ఆ కుర్రాడు సింఫుల్ గా వచ్చేశాడు. కానీ.. ఇక్కడే సీన్ మరోలా మారింది. పెళ్లి కూతురి గెటప్ లో మెరిసిపోతూ.. తన అపార్ట్ మెంట్ కు తన బాయ్ ఫ్రెండ్ ను ఓనర్ని చేసే పేపర్లు సిద్ధం చేసి.. అతగాడికి ఎంతో ఇష్టమైన హార్లీ డేవిడ్ సన్ బైకు తాళాలు చేతిలోపెట్టి.. మోకాళ్ల మీద కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది. ప్రియురాలి ప్రపోజల్ కు షాక్ తిన్న ఆ కుర్రాడు ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోయాడు. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక.. ఈ ఎపిసోడ్ ని మాల్ దగ్గర ప్రత్యక్షంగా చూసిన వారంతా చప్పట్లు కొట్టేశారు. అందాల ముద్దుగుమ్మ.. సినిమాటిక్ గా ప్రపోజ్ చేస్తే..కాదనే మగాడు ఎవరుంటారు చెప్పండి.