Begin typing your search above and press return to search.

గులాబీ ఎమ్మెల్యే ని దుమ్ముదులిపిన వీర మహిళ!

By:  Tupaki Desk   |   31 Dec 2019 1:56 PM GMT
గులాబీ ఎమ్మెల్యే ని దుమ్ముదులిపిన వీర మహిళ!
X
ప్రజాప్రతి నిధులు ..అంటే నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలకై పోరాడుతూ వారికీ ఉండే అన్ని సమస్యలని తమ సమస్యలుగా భావించి తీర్చే వారిని ప్రజాప్రతినిధులు అంటారు. కానీ , ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతి నిధులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్ల కోసం బయటకి వచ్చి, నాలుగు ఆఫర్లు చెప్పి ...వారిని ఆకట్టుకొని పదవి దక్కించుకోవడం. ఆ తరువాత మళ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు వారు ఎక్కడ ఉండేది కూడా ఎవరికీ తెలియదు . కానీ , ఆలా ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నేతలపై కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.

తాజాగా ఇదే పరిస్థితి తెలంగాణ లోని టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేకి ఎదురైంది. ఒక ఎమ్మెల్యే అని చూడకుండా చెడామడా కడిగిపారేసింది. ‘ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన్రు. ఇప్పటిదాక మా సమస్యలు పట్టించుకోలే. ఇప్పుడు ఎన్నికలొచ్చినయని ఓట్ల కోసం వచ్చి.. అభివృద్ధి మాట మాట్లాడుతున్నరు. ఎట్ల నమ్ముడు’’ అంటూ ఒక మహిళా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను అడగడం తో ఎమ్మెల్యే నోట్లో నుండి మాట రాలేదు. ఇంతకీ ఇప్పుడు ఎందుకు అక్కడకి పోయిండు అనుకుంటున్నారా ...తెలంగాణ లో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా ..ఆ ఎన్నికలలో టి ఆర్ ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి వెళ్లారు.

సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా 9వ వార్డులో మహిళా ఓటర్లు కొందరు ఎమ్మెల్యేను సమస్యలపై నిలదీసి అభివృద్ధి ఎక్కడంటూ ప్రశ్నించారు. దీంతో షాక్ అయిన ఎమ్మెల్యే చిన్నయ్య.. అభివృద్ధి చేస్తున్నామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని వారిని సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ , అందుకు వారు.. మాయమాటలు, అబద్ధాలు చెప్పవద్దని, టీఆర్ ఎస్ కు ఓట్లు వేసే ప్రసక్తే లేదని చెప్పడంతో ఎమ్మెల్యే తో పాటు ఇతర నాయకులు అక్కడితో ప్రచారం ఆపేసి వెనుదిరిగారు. దీనితో ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండనుందో అని లోకల్ టీఆర్ ఎస్ నేతలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.