Begin typing your search above and press return to search.

24 ఏళ్ల యువతిపై ఆరుగురు మైనర్ల గ్యాంగ్ రేప్

By:  Tupaki Desk   |   9 Feb 2020 4:29 AM GMT
24 ఏళ్ల యువతిపై ఆరుగురు మైనర్ల గ్యాంగ్ రేప్
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవర్నినమ్మాలో.. ఎవర్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఎంత నమ్మకుమున్నా.. కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వాదన ఎంత వాస్తవమన్న విషయాన్ని తెలియజేసే ఉదంతం ఒకటి తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఇరవై నాలుగేళ్ల యువతిని ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగానే కాదు షాకింగ్ గా మారింది.

మహబూబాబాద్ జిల్లా అమన్ గల్ ఊరు చివర్లో చోటు చేసుకున్న ఈ దారణంలోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువతికి అమన్ గల్ గ్రామానికి చెందిన పదిహేడేళ్ల మైనర్ యువకుడితో పరిచయం ఏర్పడింది. క్యాటరింగ్ పనులు చేసే అతడితో ఆమె పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అలా వారి మధ్య అప్పుడప్పడు ఫోన్ సంభాషణలు సాగేవి. స్నేహంలో ఫోన్లు మాట్లాడుకోవటం మామూలే అన్నట్లుగా ఆమె మాట్లాడేది.

ఇదిలా ఉంటే.. తాను మానుకోటకు వస్తున్నానని.. బంధువుల ఇంటికి వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. అందుకు సరేనన్న సదరు మైనర్ యువకుడు.. ఆమె వద్దకు తనతో పాటు మరో ఇద్దరు మైనర్లను తీసుకొచ్చాడు. వారి దుర్మార్గపు ఆలోచనల్ని పసిగట్టని ఆమె.. అతడ్ని నమ్మి ఆటో ఎక్కింది. అమన్ గల్ దగ్గర్లోని మామిడి తోటలోకి తీసుకెళుతుంటే.. ఇటెందుకు వెళుతున్నట్లు? అని అడిగితే షార్ట్ కట్ అన్న సమాధానం రావటంతో ఊరుకుండిపోయింది.

మామిడితోటకు ఆటోను తీసుకెళ్లినంతనే అక్కడే మరో ముగ్గురు మైనర్లు సిద్ధంగా ఉన్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకున్నారు. దీంతో భయానికి గురైన ఆమె అరవటం మొదలు పెట్టింది. దాంతో ఆమె నోటిని బలంగా మూసేశారు. దీంతో కాసేపు గింజుకున్న ఆమె.. స్పృహ కోల్పోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ ఆరుగురు.. ఆమెపై వరుస పెట్టి గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు.

తోట వైపు వెళుతున్న స్థానికులు.. అక్కడ అనుమానాస్పద నీడలు కనిపించటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్నవారు.. జరిగింది తెలుసుకొని షాక్ తిన్నారు. నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారిలో ముగ్గురు దొరకగా.. మరో ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంటాడి అదుపులోకి తీసుకున్న పోలీసులు. నమ్మి సాయం అడిగిన ఆ యువతికి తానెంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అస్సలు ఊహించి ఉండరని చెప్పాలి. సో.. ఎవరికి వారు అంతో ఇంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన దరిద్రపుగొట్టు రోజులు వచ్చాయని చెప్పకతప్పదు.