Begin typing your search above and press return to search.

ఈ అందెగ‌త్తె పోటీ కంటే ముందే గెలిచింది

By:  Tupaki Desk   |   28 Jun 2017 4:26 PM GMT
ఈ అందెగ‌త్తె పోటీ కంటే ముందే గెలిచింది
X
సాధార‌ణంగా అందాల పోటీల విజేత‌లు ఎప్పుడు ఎన్నిక‌వుతారు? పోటీ జ‌రిగి ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత‌నే క‌దా? కానీ ఈ అమ్మాయి అంత‌కుముందే విజేత‌గా గెలిచింది. అదెలాగా అంటే ఆమె ప్ర‌యత్నాల ద్వారా - ఆత్మ‌విశ్వాసంతో! అందాల పోటీల స్థాయిలో అందం లేక‌పోయినా త‌న ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తూ ఉండ‌టం వ‌ల్ల‌! మలేసియాకు చెందిన ఎవిటా డెల్ముండోది ఈ స్పూర్తిదాయ‌క‌మైన సంద‌ర్భం.

20 ఏళ్ల ఎవిటా ఓ కెఫేలో పార్ట్‌ టైమ్‌ జాబ్ చేస్తోంది. పుట్టుకతోనే ముఖం - మెడ - ఇతర శరీర భాగాలపై పుట్టుమచ్చలున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మచ్చల కూడా పెద్దవయ్యాయి, వంటి నిండా మ‌చ్చ‌లు క‌ప్పేశాయి. దీంతో క్లాస్‌ మేట్స్‌ - టీచర్లు స‌హ‌జంగానే చీత్క‌రించారు. ఆమెతో ఆడుకోవడానికి ఎవరూ ఇష్టపడేవారు కారు. అలా చీత్కారాల నడుమ స్కూల్‌డేస్‌ భారంగా గడిచాయి. అయితే కొద్దికాలానికి ఆమె మ‌రో స్కూల్‌ కు మారింది. అక్క‌డే ఆమెకు క‌లిసివ‌చ్చింది. ఎవిటా శ‌రీరాన్ని కాకుండా ఆమెలోని ఆత్మ‌స్థైర్యాన్ని చూసిన స్నేహితులు దొరికారు. ఎంతో స్పూర్తి నింపారు. ఈ ఉత్సాహంతోనే మిస్‌ యూనివర్స్‌ మలేసియా- 2018 పోటీల్లో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతోంది. కేవ‌లం ఆశ‌ప‌డ‌ట‌మే కాకుండా అందుకు ప్ర‌య‌త్నం సైతం చేస్తోంది. ఇటీవ‌లే మిస్‌ యూనివర్స్‌ మలేసియా- 2018 పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం పరీక్షలు నిర్వ‌హించ‌గా ఎవిటా సత్తాచాటింది. త్వ‌ర‌లో ఫ‌లితాలు రానున్నాయి. అందులో విజ‌యం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే...ఇప్ప‌టికే మ‌లేషియ‌న్ల మ‌దిని ఎవిటా గెలుచుకుంది.

ఇంతకీ త‌న‌కు ఉన్న మ‌చ్చ‌లపై ఎవిటా ఏమంటోంద‌ని చెప్ప‌నే లేదు క‌దా! ఆమె త‌న‌కు ఏదో ఇబ్బంది జ‌రిగింద‌ని అస్స‌లు భావించ‌డం లేదు. అందుకే గ‌తంలో ఓ సారి ఆస్ప‌త్రిలో చేరి చికిత్స చేసుకోవాల‌ని చూస్తే నో చెప్పింది. త‌న పుట్టుక‌తోనే ఈ మ‌చ్చ‌లు వ‌చ్చాయ‌ని, వాటిని తాను వైక‌ల్యంగా భావించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఐ లవ్‌ మై స్కిన్‌.... ఐ లవ్‌ మై సెల్ప్ అంటూ త‌న ఆత్మ విశ్వాసం గురించి చాటి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/