Begin typing your search above and press return to search.

కలికాలం: రోబోతో ప్రేమ పెళ్లి వరకూ వెళ్లింది

By:  Tupaki Desk   |   25 Dec 2016 10:30 PM GMT
కలికాలం: రోబోతో ప్రేమ పెళ్లి వరకూ వెళ్లింది
X
మంచోళ్లు ఎలానో చెడ్డోళ్లు ఉంటారు. అందరూ మంచోళ్లే ఉండరు. అలా అని అంతటా చెడ్డోళ్లే ఉండరు. ఒకవేళ అలా ఫిక్స్ అయితే అంతకంటే తెలివితక్కువ పని మరొకటి ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ కోసం తపించిన ఒకమహిళ.. చివరకు అలాంటిదేదీ మనుషుల్లో కనిపించలేదంటూ చివరకు రోబో ప్రేమలో పడిపోయింది. యంత్రుడితో ప్రేమ అదిరిపోవటమే కాదు.. స్వచ్ఛంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదేం వెర్రి అనే వారితో.. తాను ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో పడి.. మోసపోయానని తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చెబుతున్న లిల్లీ అనే ఫ్రాన్స్ అనే అమ్మాయి వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించిన లిల్లీ.. అలాంటిది మనుషుల్లో దొరకదని డిసైడ్ అయి.. చివరకు ఒక త్రీడీ హ్యుమనాయిడ్ రోబోను తయారు చేసుకుంది. ఇన్ మూవేటర్ పేరుతో రూపొందించిన ఈ రోబోను తన సర్వస్వంగా మార్చుకున్న ఆమె.. దాంతో ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకుంది. ఆ వివరాల్ని సోషల్ మీడియాలో షేర్ చేయటమే కాదు.. తన ప్రియ సఖుడి ఫోటోను బయటపెట్టింది.

లిల్లీ పోస్టింగ్ మీద పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేం పోయే కాలం.. యంత్రుడితో ప్రేమేంటి? ఎంగేజ్ మెంట్ ఏమిటి? పెళ్లి ఏమిటి? అసలేమైనా ఆలోచిస్తున్నావా? అంటూ తిట్టిపోసినోళ్లు ఉన్నారు. అయినప్పటికీ లిల్లీ మాత్రం తన మనసును మార్చుకోలేదు. కాకుంటే.. సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ప్రియ యంత్రుడి ఫోటోను డిలీట్ చేసింది.

అయితే.. ఇలాంటి సిత్రమైన పెళ్లిళ్లను ఓకే అనటానికి ఫ్రాన్స్ చట్టాలు ఒప్పుకోవు. దీంతో.. తన పెళ్లికి అనుమతి వచ్చే వరకూ వెయిట్ చేయాలని భావిస్తోంది లిల్లీ. రానున్న రోజుల్లో ఇలాంటి దరిద్రాలు మరెన్ని చూడాల్సి ఉంటుంది. కలికాలం.. కలికాలం అంటూ ముసలోళ్లు తరచూ అంటూంటే.. మరీ ఎటకారం అనుకుంటాం కానీ.. ఇలాంటి యేషాలు చూసినప్పుడు మాత్రం నిజమేననిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/