Begin typing your search above and press return to search.
మ్యాచింగ్ సెంటర్ ముసుగులో సెక్స్ రాకెట్ .. ముఠా గుట్టురట్టు !
By: Tupaki Desk | 20 March 2021 7:30 AM GMTమ్యాచింగ్ సెంటర్ ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచార దందాను అరికట్టడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎక్కడ చూసినా సెక్స్ రాకెట్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా విటులకు ఎర వేస్తున్న వారు కొందరైతే , చిన్న చిన్న వ్యాపారాల ముసుగులో చీకటి దందా కొనసాగిస్తున్న వారు మరికొందరు. బ్యూటీ పార్లర్ లు , స్పాల ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్న అనేక ముఠాల గుట్టును ఇప్పటివరకు పోలీసులు రట్టు చేశారు. అయితే అలా కాకుండా, ఎవరికీ అనుమానం రాకుండా, చీరల వ్యాపారం , మ్యాచింగ్ సెంటర్ ల పేరుతో కూడా వ్యభిచార దందా నడుస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
గుంటూరు ఏటీ అగ్రహారం జీరో లైనులో నివాసం ఉండే షేక్ లాల్బీ అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది. పదేళ్ల కిందట ప్రైవేట్ ట్రావెల్స్ లో పనిచేసే శ్రీనివాసరావును వివాహం చేసుకుంది. అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాచలోనతో మ్యాచింగ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో షాపునకు వచ్చే చిన్న కుటుంబాలకు చెందిన మహిళలు, భర్తను కోల్పోయినవారు, కుటుంబ పరిస్థితులు సరిగా లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న యువతులను మభ్యపెట్టి వారిని చీకటి కూపంలోకి దింపి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో నగరంపాలెం పోలీసులు ఈ నెల 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంలో దాడి చేసి నిర్వాహకురాలు శ్రీలక్ష్మి , ముగ్గురు యువతులు, ముగ్గులు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ కే సుప్రజ ఈ కేసు వివరాలను వెల్లడించడంతో పాటుగా మరి ఎక్కడైనా ఇలాంటి దందా సాగుతుంటే సమాచారం అందించాలని కోరారు. వ్యభిచార దందాకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సైతం వెల్లడించారు.