Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యేపై మహిళ సంచలన ఆరోపణలు.. నా బిడ్డకు తండ్రివి నువ్వే
By: Tupaki Desk | 8 Feb 2022 5:30 AM GMTకర్ణాటక బీజేపీ ఎమ్మెల్యపై ఒక మహిళ చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు పుట్టిన బిడ్డకు తండ్రి సదరు ఎమ్మెల్యేనని పేర్కొంటూ చేస్తున్న ఫిర్యాదు ఇప్పుడు షాకింగ్ గా మారింది. సేడం విధాన సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ పై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అక్రమంగా బంధించారని బాధితురాలి ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే.. సదరు మహిళ ఆరోపణల్ని బీజేపీ ఎమ్మెల్యే కొట్టి పారేస్తున్నారు.
అయితే.. సదరు మహిళతో తనకు పరిచయం ఉందని.. వ్యక్తిగత పనుల కోసం తన వద్దకు వచ్చినట్లుగా ఆయన చెబుతున్నారు. 2009లో ఆమె పరిచయమైందని.. 2013లో ఒకసారి తనను కలిసి భూవివాదాన్ని పరిష్కరించాలని కోరినట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరోసారి కొడుకు చదువు కోసం సాయం చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత కొన్నేళ్లకు తనపై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని.. జాతీయ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేస్తానని బెదిరించారని.. ఫిర్యాదు ఇవ్వకూడదంటే డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు.
ఇప్పుడు ఏకంగా ఆమె బిడ్డకు తననే తండ్రిగా నింద మోపుతున్నారని వెల్లడించారు. బిడ్డ సంరక్షణ కోసం రూ.2కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. ఇదంతా తన రాజకీయ వ్యతిరేకులతో కలిసిన సదరు మహిళ చేతులు కలిపి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు ఎమ్మెల్యే చెబుతున్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు అందరి నోట నానుతోంది. మహిళ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా ఎమ్మెల్యే మాటలు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఉదంతంలో ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేస్తున్న మహిళకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలిచింది.
సోషల్ మీడియాలో సీఎం బొమ్మైకి తన కష్టాల్ని చెప్పుకున్న సదరు మహిళ.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ విధానసౌధ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు వెళితే.. అక్కడి పోలీసులు ఆమెను హౌస్ అరెస్టు చేశారంటూ ఆమ్ ఆద్మీ మండిపడుతోంది.
ఇప్పటికే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పలువురు మహిళలపై లైంగిక దాడులు.. అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నా సీఎం ఇప్పటివరకు స్పందించలేదని ఆమ్ ఆద్మీఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చూస్తుంటే.. ఈ ఇష్యూ రాజకీయంగా బీజేపీకి కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుందేమోనన్న అనుమానం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.