Begin typing your search above and press return to search.

త‌ల్లి శవంతో 20 గంట‌ల జాగారం

By:  Tupaki Desk   |   3 Dec 2015 12:07 PM GMT
త‌ల్లి శవంతో 20 గంట‌ల జాగారం
X
భారీ వ‌ర్షాల‌కు చెన్నై ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి. వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో చెన్నైలో ప‌క్క వీధుల‌తోనే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. న‌గ‌రంలో ప్ర‌వ‌హిస్తున్న మూడు న‌దులు పిల్ల‌కాల్వ‌ల్లా మారిపోయాయి. చెన్నై వాసుల‌కు తిన‌డానికి తిండి...తాగ‌డానికి నీరు కూడా దొర‌క‌డం లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే త‌మ సొంత మ‌నుష్యులు చ‌నిపోతే క‌నీసం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కూడా వీలులేక న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు.

న‌గ‌రంలోని అశోక్‌ న‌గ‌ర్ ప్రాంతంలో ఓ మ‌హిళ చ‌నిపోయిన త‌న త‌ల్లి శ‌వం వ‌ద్ద ఏకంగా 20 గంట‌ల పాటు జాగారం చేస్తోంది. ఆమెను ఎవ్వ‌రు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో త‌ల్లి శ‌వం వ‌ద్ద అలాగే ఉంది. చివ‌ర‌కు స‌న్నిహితుల ద్వారా మీడియాను ఆశ్ర‌యించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌య‌మై ఆమె మాట్లాడుతూ త‌న త‌ల్లి డ‌యాలిసిస్ ఫేషెంట్ అని ఆమె బుధ‌వారం మృతిచెందగా...అప్ప‌టి నుంచి క‌రెంటు లేక‌పోవ‌డంతో చీక‌ట్లోనే మ‌గ్గుతున్నామ‌ని ఆమె వాపోయింది.

త‌న త‌ల్లి శ‌వాన్మి శ్మ‌శానానికి త‌ర‌లించేందుకు ద‌య‌చేసి ఎవ‌రైనా త‌న‌కు స‌హాయం చేయాల‌ని.....వాహ‌నం పంపాల‌ని ఆమె వేడుకుంది. ఈ విష‌యం తెలుసుకున్న ఆమె స‌న్నిహితులు ఈ విష‌యాన్ని మీడియా దృష్టికి తీసుకు రావ‌డంతో ఆమె త‌ల్లి శ‌వంతోనే 20 గంట‌ల పాటు జాగారం చేస్తున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదిలా ఉంటే న‌గ‌రంలో బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు సైన్యం, నావికా దళం, వాయుసేన బ‌ల‌గాలు అహ‌ర్నిశం శ్ర‌మిస్తున్నా...స‌హాయ‌క చ‌ర్య‌లు ఓ కొలిక్కి రావ‌డం లేదు.