Begin typing your search above and press return to search.

అద్దె అడిగితే రేప్ చేశావని కేసు పెడతా..వార్నింగ్ ఇచ్చిన మహిళ!!

By:  Tupaki Desk   |   8 Feb 2021 9:40 AM IST
అద్దె అడిగితే రేప్ చేశావని కేసు పెడతా..వార్నింగ్ ఇచ్చిన మహిళ!!
X
రక్షణ కల్పించాల్సిన చట్టాల్ని తనకు తగ్గట్లుగా మార్చుకొని ఆట ఆడే కొందరు ఉంటారు. తాజా ఉదంతం ఆ కోవలోకే వస్తుంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కుందనహళ్లికి చెందిన ఉదంతం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇలాంటి దిక్కుమాలిన తెలివితేటలు కూడా వేస్తారా? అన్న భావన కలగటమే కాదు.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇంతకూ ఏమైందంటే..

కుందనహళ్లికి చెందిన వెంకటరెడ్డి తన ఇంటిని భువన.. విశాల్ అనే వారికి అద్దెకు ఇచ్చారు. రాజస్థాన్ కు చెందిన వీరు ఎనిమిదేళ్ల క్రితం వెంకటరెడ్డికి చెందిన భవనాన్ని పీజీ హాస్టల్ నిర్వహించటానికి తీసుకున్నారు. అద్దె అడిగితే ఇవ్వలేదు సరికదా.. రేపు.. మాపు అంటూ వాయిదాలు వేస్తున్నారు. అద్దె ఇవ్వాల్సిందేనని గట్టిగా అడగటంతో.. అలా చేస్తే అత్యాచారం కేసు పెడతానని సదరు మహిళ రివర్సు కావటంతో షాక్ తిన్నాడు వెంకటరెడ్డి.

ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో రంగంలోకి దిగిన వారు ఆధారాల్ని పరిశీలించి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. అద్దె చెల్లించకుండా ఇలాంటి వేషాలు కూడా వేస్తారా? అన్న విస్మయానికి గురవుతున్నారు.