Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: రోడ్లపై 9 లక్షలు విసిరేసింది
By: Tupaki Desk | 24 July 2018 8:42 AM GMTఓ కారు వేగంగా వెళుతోంది.. వెనుకాలే మరో కారు వస్తోంది. ఇంతలో ఓ కూడలి వచ్చింది. ముందు వెళుతున్న కారులోంచి కుప్పలుగా డబ్బును రోడ్లపై విసిరేశారు. ఆశ్చర్యం వెనుకున్న కారు ఆపి చూశాడు. నిజంగా డబ్బులే.. కానీ డబ్బులు విసిరిన కారు ఆగలేదు. అలా సిటీలోని పలు చోట్ల ఇలానే డబ్బులు వెదజల్లారు. వేలల్లో కాదు.. లక్షల్లో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దక్షిణ కొరియా దేశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ధనవంతురాలు దయేగు సిటీ రోడ్లపై పలు కూడళ్ల వద్ద డబ్బులు వెదజల్లింది. కారులో వేగంగా వెళ్తుండగానే ఇలా డబ్బుల కట్టలు చల్లుకుంటూ పోయింది. ఆ డబ్బుల విలువ 15.8 మిలియన్ కొరియన్ కరెన్సీ . మన ఇండియన్ రూపాయాల్లో లెక్కలు వస్తే దాదాపు 9 లక్షలు అని తేలింది. ఆ డబ్బులను ఎవ్వరూ తీసుకోలేదు. ఎందుకంటే కొరియాలో రోడ్లపై డబ్బులు ఏరుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించగా డబ్బును స్వాధీనం చేసుకొనిఆ డబ్బులు ఎందుకు వెదజల్లింది ఏంటా కథా అని పోలీసులు ఆరాతీశారు.
సౌత్ కొరియాలోని ఓ సంపన్నురాలు దానధర్మాలు చేయాలని భావించి ఇలా కారులో వెళుతూ పేదలు ఉండే ప్రాంతాల్లో కారులోంచి డబ్బులు విసిరింది. కారును గుర్తించిన పోలీసులు ఆమె తల్లిని ఈ విషయంపై ఆరాతీయగా సంచలన విషయం వెల్లడించింది. ‘నా కూతురు ఎవ్వరూ ఆపదలో ఉన్నా.. అవసరం ఉందని డబ్బు సాయం కోరినా చేస్తుందని.. దానధర్మాలు చేయాలనే భావించి ఇలా డబ్బులను రోడ్లపై చల్లిందని’ వ్యాఖ్యానించింది. పారేసిన డబ్బులు తమవే అని క్లెయిమ్ చేసుకుంటే తిరిగి ఇస్తామని పోలీసులు సదురు మహిళకు సూచించారు.