Begin typing your search above and press return to search.
ఆ మహిళకు మోడీలో దేవుడు కనిపించాడట!
By: Tupaki Desk | 7 March 2020 1:11 PM GMTకరోనా వైరస్ పై వదంతులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఇలాంటి ప్రచారానికి బ్రేకులు వేసేందుకు ప్రధాని మోడీనే స్వయంగా రంగంలోకి దిగారు. వీడియో కాన్ఫరెన్స్ద్వారా జనఔషధీ కేంద్రాల యజమానులతోనూ.. ఆ కేంద్రాల కారణంగా లబ్థి పొందిన వారితోనూ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అనుకోని రీతిలో భావోద్వేగ పరిణామం చోటు చేసుకుంది.
కరోనాపై పుకార్లు నమ్మొద్దని.. వైద్యులు చెప్పే మాటల్ని నమ్మాలన్న ఆయన.. ఇప్పుడు ప్రపంచం మొత్తం షేక్ హ్యాండ్ కు బదులుగా నమస్తే పెట్టే అలవాటు చేసుకుంటుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో అందరూ నమస్తే పెట్టాలన్నారు. ఇదిలా ఉంటే.. జన ఔషధీ కేంద్రాల కారణంగా తానెంత లబ్థి పొందానన్న విషయాన్ని దీపా షా అనే మహిళ మాట్లాడారు. ఆమె మాటలు మోడీని తీవ్రమైన భావోద్వేగానికి గురి చేశాయి.
తనకు 2011లో పక్షవాతం వచ్చిందని.. దీంతో సరిగా మాట్లాడలేకపోయేదానినని చెప్పారు. వైద్యం కోసం భారీగా ఖర్చులు అయ్యేవని.. అలాంటి పరిస్థితుల్లో జన ఔషధి పథకం తనకెంతో రిలీఫ్ ను ఇచ్చిందన్నారు. రూ.5వేలు విలువ చేసే మందుల్ని తాను రూ.1500లకే కొనుగోలు చేస్తున్నానని చెప్పారు.
వైద్యం ఖర్చులు తగ్గటంతో తాను కడుపు నిండా తినగలుగుతున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని తెచ్చిన మోడీకి థ్యాంక్స్ చెప్పిన ఆమె.. తాను ప్రత్యక్షంగా దేవున్ని చూడలేదని.. మోడీలో తనకు దేవుడు కనిపిస్తున్నాడని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని చూసిన మోడీ భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని క్షణాలు తల దించుకొని దు:ఖాన్ని దిగమింగుకున్న ఆయన.. ఆమె మాటల్ని శ్రద్ధగా వినటం కనిపించింది. తాజా వీడియో కాన్ఫరెన్స్ ఎమోషనల్ కార్యక్రమంగా మారిందనే చెప్పాలి.