Begin typing your search above and press return to search.
రాజస్థాన్ నుంచి ముంబైకి రైల్లో 20 లీటర్ల పాలు ..ఎందుకంటే ?
By: Tupaki Desk | 13 April 2020 1:30 PM GMTచైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా మృత్యువాత పడ్డారు.కరోనా ను అరికట్టడానికి ప్రపంచం మొత్తం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కారణంగా రవాణ వ్యవస్థ పూర్తిగా బంద్ అయ్యింది. దీంతో ఎక్కడి వ్యక్తులు అక్కడే ఆగిపోయారు. ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యవసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఈ లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు ..కానీ , కరోనా ను అడ్డుకోవాలంటే లాక్ డౌన్ కాకా మరో మార్గం లేదు. దీనితో లాక్ డౌన్ అనివార్యం.
ఈ నేపథ్యంలోనే ముంబైలోని బాద్రాలో నివసించే రేణుకుమారి అనే మహిళ ఇటీవలే ప్రధాని మోడీకి ఓ ట్వీట్ చేసింది. తన మూడున్నరేళ్ల కుమారుడికి అరుదైన వ్యాధి ఉందని, అతనికి ఒంటెపాలు తప్పించి మరేమి పడవని, తన దగ్గరనున్న ఒంటెపాల పొడి కూడా అయిపోయిందని, లాక్ డౌన్ కారణంగా నేను ఎక్కడికి పోలేక పోతున్నా అని , ఎలాగైనా తన కుమారుడిని కాపాడాలని చెప్పి ప్రధానికి ట్వీట్ చేసింది.
దీనిపై వెంటనే రైల్వే సిబ్బంది స్పందించి ముంబై లో మూడు రోజులకు సరిపడా ఒంటెపాల పౌడర్ ను ఆ మహిళకు అందజేశారు. ఆ తరువాత ఒంటెపాల రాజస్థాన్ లోని ఓ ఫారంలో దొరుకుతాయని ఓ స్వచ్చంద సంస్థ తెలిపింది. వెంటనే రైల్వేశాఖ వేగంగా స్పందించింది. పంజాబ్ లోని లూథియానా నుంచి ముంబై వస్తున్న గూడ్స్ రైలును రాజధానిలో దారిమళ్లించి ఒంటెపాలు, ఒంటెపాల పొడి అందించే ఓ చిన్న రైల్వే స్టేషన్ కు రైలును తీసుకెళ్లారు. అక్కడ వాటిని ఆ రైల్లోకి ఎక్కించారు. అక్కడి నుంచి రైలు ముంబైకు బయలుదేరి వచ్చింది. ఆలా ఆ రైలు ముంబై కి చేరుకోగానే ఆ మహిళకు 20 లీటర్ల పాలు, పాలపొడిని అందించి పిల్లాడి ప్రాణాలు కాపాడారు.