Begin typing your search above and press return to search.
సీన్ రివర్స్ఃభర్తకు ట్రిపుల్ తలాక్!
By: Tupaki Desk | 4 May 2017 11:17 AM GMTముస్లిం సంప్రదాయం ప్రకారం..సింపుల్ గా మూడుసార్లు తలాక్ అనేసి నచ్చని భార్యను వదిలించుకోవడం ముస్లిం భర్తకు ఉన్న హక్కు. అయితే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉన్న ఓ ముస్లిం మహిళ మాత్రం అదే ట్రిపుల్ తలాక్ తో తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటుండటం తాజా ట్విస్ట్. తన భర్త, అతని కుటుంబ సభ్యుల తీరు నచ్చని అమ్రీన్ బానో అనే ఆ మహిళ.. తలాక్ చెప్పేయాలని అనుకుంటున్నట్లు పబ్లిగ్గానే చెప్పడం విశేషం. మహిళను వదిలించుకోవడానికి వాళ్లు ట్రిపుల్ తలాక్ ఎలా చెబుతారో.. తాను కూడా అదే స్టైల్లో విడాకులు కోరుకుంటున్నానని అమ్రీన్ స్పష్టంచేసింది.
అమ్రీన్ సోదరిని తన భర్త సోదరుడికే ఇచ్చి పెళ్లి చేశారు. అయితే గత ఏడాది గొడవ జరిగి తన సోదరి భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇచ్చేశాడు. దీంతో అమ్రీన్ కూడా తన భర్త నుంచి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన భర్తకు ట్రిపుల్ తలాక్ తో విడాకులు ఇచ్చే హక్కు తనకూ కావాలని ఆమె డిమాండ్ చేస్తుండటం విశేషం.
ఇదిలాఉండగా.... లక్నోలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు ముగ్గురు భార్యలు షాకిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన దనిశ్ అనే వ్యక్తి 2013లో మొదటి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత యువతిని చిత్రహింసలు పెట్టి అసభ్య వీడియోలు తీసి విషయం ఎవరికైనా చెబితే లీక్ చేస్తానని బెదిరించి విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని ఆమెతోనూ ఇలాగే ప్రవర్తించాడు.అంతటి ఆగకుండా బంధువైన 15 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి ఆమెనీ పెళ్లి చేసుకున్నాడు. కనీసం తనతోనైనా సక్రమంగా ఉన్నాడా అంటే అదీలేదు. ఇద్దరి భార్యలను మోసం చేసినట్లే ఈ బాలికనీ మోసం చేసి ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. అనంతరం నాలుగో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఈ విషయం తెలిసి తమలా మరో ఆడదాని జీవితం బలికాకూడదని భావించి వెంటనే ముగ్గురు భార్యలూ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పెళ్లి పెటాకులైంది. పోలీసులు దనిశ్‌ను అరెస్ట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/