Begin typing your search above and press return to search.
అబ్బాయిలా యాక్ట్ చేసి..అంతమంది అమ్మాయిల్ని రేప్ చేసిందట!
By: Tupaki Desk | 11 Jan 2020 4:47 AM GMTవిన్నంతనే విచిత్రంగానే కాదు.. విడ్డూరంగా అనిపించే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. ఎంతకూ నమ్మాలనిపించే ఈ క్రైం షాకింగ్ గా అనిపించక మానదు. ఒక అమ్మాయి అబ్బాయిలా నటిస్తూ.. టీనేజర్లకు వల వేయటమే కాదు..దాదాపు పన్నెండు మంది అమ్మాయిల్ని రేప్ చేసిన ఉదంతం బయటకు వచ్చి సంచలనంగా మారింది. తాజాగా ఈ దారుణానికి పాల్పడిన నిందితురాల్ని చర్యల్ని గుర్తించటమే కాదు.. ఆమెను దోషిగా నిర్దారిస్తూ ఏకంగా ఎనిమిదేళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు ఒకటి తీర్పునిచ్చింది.
బ్రిటన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. 21 ఏళ్ల గెమ్మావాట్స్ కు ఒక చిత్రమైన అలవాటు ఉంది. అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా తయారయ్యేది. సోషల్ మీడియాలో జేక్ వాటన్ పేరుతో ఇన్ స్టా.. ఫేస్ బుక్.. స్నాప్ చాట్ లలో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేసేది. 16 ఏళ్ల అబ్బాయి మాదిరి డ్రెస్సింగ్ చేసేది. తలకు క్యాప్ పెట్టుకొని ఆమె తీసుకున్న ఫోటోల్ని చూసిన వారెవరైనా సరే.. ఆమెను అబ్బాయి అనుకోవాలే కానీ.. అమ్మాయి అని ఎంతమాత్రం అనుకోరు.
తనకంటే వయసులో చాలా చిన్న అమ్మాయిల్ని.. మరి ముఖ్యంగా మైనర్ బాలికలను టార్గెట్ చేసేది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేది. వారిని నెమ్మదిగా మాటల ముగ్గులోకి దించి.. స్నేహితుడిలా వ్యవహరిస్తూ వారిని అదే పనిగా పొగిడేసేది. పరిచయం పెరిగిన తర్వాత ఇంటికి పిలిచి.. వారికి ఫుడ్ ఇచ్చేది. అందులో మత్తు పదార్థాల్ని ఉంచేది. నమ్మి తినేసిన వారు మత్తులోకి జారుకున్న తర్వాత వారిపై లైంగిక దాడి చేసేది.
ఇలా డజనుకు పైనే అమ్మాయిల పట్ల లైంగిక దాడి చేసిన ఆమెలో సెక్సు కోరికలు ఎక్కువగా ఉండేవని చెబుతున్నారు. ఇది తీర్చుకోవటానికి అబ్బాయిలా వ్యవహరిస్తూ చేసిన పనిని జీర్ణించుకోలేకపోతున్నారు. బాధిత బాలికలు వేర్వేరు చోట్ల ఇచ్చిన నాలుగు ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఎట్టకేలకు గెమ్మాను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
ఆమె చెప్పిన మాటలు.. తాను ఎలా మోసగించేదన్న విషయాన్ని ఆమె చెబుతుంటే.. పోలీసులు సైతం షాక్ తిన్నారట. ఈ కేసును విచారించిన వించెస్టర్ క్రౌన్ కోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. పలు దారుణాలకు పాల్పడిన 21 ఏళ్ల గెమ్మాకు ఎనిమిదేళ్లు జైలుశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.ఇప్పుడున్న పాడు రోజుల్లో.. ఎవరిని నమ్మలేని పరిస్థితి. కొత్త వారితో స్నేహం చేసేటప్పడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సుమా.