Begin typing your search above and press return to search.

ప్రియుడ్ని సొంతం చేసుకోవ‌టానికి యాసిడ్ పోసింది!

By:  Tupaki Desk   |   17 Jun 2019 10:42 AM GMT
ప్రియుడ్ని సొంతం చేసుకోవ‌టానికి యాసిడ్ పోసింది!
X
కొన్ని సినిమాల్లో.. టీవీ సీరియ‌ల్స్ లో ఆడాళ్ల‌ను భ‌యంక‌రంగా.. అత్యంత దుర్మార్గంగా చూపిస్తుంటారు. వాళ్ల విల‌నీ చూస్తే.. ఆడాళ్ల‌లో ఇలాంటి బ్యాచ్ ఉంటుందా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు. తాజాగా వెలుగు చూసిన ఉదంతంలో ఒక మ‌హిళ గురించి వివ‌రాలు తెలిసిన‌ప్పుడు రీల్ మీద చూసే విల‌నిజం రియ‌ల్ గా క‌నిపించ‌ట‌మే కాదు.. వామ్మో ఇలాంటి లవ్వ‌ర్ ఎప్ప‌టికి.. ఎవ‌రికి త‌గ‌ల‌కూడ‌ద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ప్రియుడ్ని త‌న సొంతం చేసుకోవ‌టానికి అత‌డిపైన యాసిడ్ దాడికి పాల్ప‌డిన ఈమె తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వికాస్ పురి ప్రాంతానికి చెందిన ఒక యువ‌తి మూడేళ్లుగా ఒక వ్య‌క్తిని ప్రేమిస్తోంది. అయితే.. వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. దీంతో.. ప్రియురాలికి బ్రేక‌ప్ చెప్పేశాడు ప్రియుడు. అయితే.. అత‌న్ని వ‌దులుకోవ‌టం ఏ మాత్రం ఇష్టం లేని యువ‌తి.. ఒక దుర్మార్గ‌మైన ప్లాన్ వేసింది.

త‌న ప్రియుడితో క‌లిసి బైక్ మీద వెళుతున్న ఆమె.. అత‌డ్ని హెల్మెట్ తీయాల‌ని కోరింది. స‌ద‌రు ప్రియుడు హెల్మెట్ తీసిన త‌ర్వాత‌.. వెనుక నుంచి యాసిడ్ చ‌ల్లేసింది. త‌న మీద అనుమానం రాకుండా ఉండేందుకు కాస్తంత యాసిడ్ త‌న మీద కూడా జ‌ల్లుకుంది. ఎవ‌రో త‌మ మీద యాసిడ్ చ‌ల్లార‌న్న భావ‌న క‌లిగేలా చేసింది.

చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరిన‌.. ఈ ఉదంతం పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు న‌మోదుచేసిన పోలీసులు విచార‌ణ షురూ చేశారు. యువ‌కుడిపై జ‌రిగిన యాసిడ్ దాడిపై అనుమానాలు వ‌చ్చిన పోలీసులు సీసీ కెమేరాల్ని చెక్ చేశారు. ఎలాంటి అనుమానాస్ప‌ద ఉదంతం క‌నిపించ‌క‌పోయేస‌రికి.. ప్రియురాల్ని కాస్త గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. దీంతో బ‌య‌ట‌ప‌డిపోయిన ఆమె.. తాను చేసిన వెధ‌వ ప‌ని గురించి చెప్పేసింది. దీంతో.. ఆమె చేసిన ప‌నికి పోలీసులు సైతం షాక్ తిన్న ప‌రిస్థితి.