Begin typing your search above and press return to search.

జై జ‌గ‌న్ : బ‌డుగుల పార్టీ వైసీపీనే ! ద‌ళితుల‌కు కూడా!

By:  Tupaki Desk   |   12 April 2022 5:32 AM GMT
జై జ‌గ‌న్ : బ‌డుగుల పార్టీ వైసీపీనే ! ద‌ళితుల‌కు కూడా!
X
బీసీ ముఖ్య‌మంత్రి ఉన్నా కూడా ఇంత‌గా మేలు చేస్తారో లేదో కానీ జ‌గ‌న్ బీసీల‌కు చేసిన మేలు మ‌రిచిపోలేనిద‌ని అంటున్నారు మంత్రి ఉష శ్రీ చ‌ర‌ణ్. కురుబ సామాజిక‌వ‌ర్గాని కి చెందిన ఆమెకు తాజాగా మంత్రివ‌ర్గం లో చోటు ఇవ్వ‌డం తో పాటు కీల‌క శాఖ అయిన మ‌హిళా,శిశు సంక్షేమాన్ని క‌ట్ట‌బెట్టారు.

ఇదే స‌మ‌యం లో మిగ‌తా మ‌హిళా మంత్రుల‌కూ కీల‌క శాఖ‌లే ద‌క్కాయి. రోజా సెల్వ‌మ‌ణికి గ‌తంలో అవంతి శ్రీ‌ను నిర్వ‌హించిన శాఖ అయిన టూరిజం, యువ‌జ‌న స‌ర్వీసులు, సాంస్కృతిక శాఖ, తానేటి వ‌నిత‌కు హోం శాఖ (ఎస్సీ మహిళ. గ‌తంలో లెక్చ‌రర్ గా కూడా ప‌నిచేశారు.

జ‌గ‌న్ క్యాబినెట్లో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ‌ను నిర్వ‌ర్తించారు.రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం. జిల్లాల మార్పులో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లా, కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అప్ప‌గించారు. గ‌తంలో ఈ ప‌ద‌విని ప్ర‌స్తుత అసంతృప్త నేత మేక‌తోటి సుచ‌రిత నిర్వ‌హించారు.

అయితే పేరు కు మాత్ర‌మే ఆమెకు ప‌ద‌వి ఉన్నా అధికారం అంతా స‌జ్జ‌ల క‌ను స‌న్న‌ల్లో న‌డిచేది అని ఓ విమ‌ర్శ అయితే ఉంది. దీనిని స‌జ్జ‌ల ఓ సారి ఖండించారు కూడా! త‌న‌కూ కీల‌క శాఖల నిర్వ‌హ‌ణ‌కూ ఏ సంబంధం లేద‌ని తేల్చేశారు. అయినా కూడా కొంత ఆయ‌న‌పై నింద ఇప్ప‌టికీ ప్ర‌చారంలోనే ఉంది. వీళ్లే కాకుండా మ‌రో బీసీ నేత విడ‌ద‌ల ర‌జ‌నీకి మంచి స్థాన‌మే ఇచ్చారు. ఆమెది ర‌జ‌క సామాజిక వ‌ర్గం. ఉన్న‌త విద్యావంతురాలు. చంద్ర‌బాబు నాటిన మొక్క అని మీడియాలో ట్రోల్ అవుతోంది.

ఈమెకు కూడా స‌ముచిత ప్రాధాన్య‌మే ద‌క్కింది. వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు.ఈ శాఖ‌ను గ‌తంలో ఆళ్ల నాని నిర్వ‌హించారు. ఈయ‌న కూడా జ‌గ‌న్ కు వీర‌విధేయుడు. కరోనా స‌మ‌యంలో కీల‌కంగా ప‌నిచేశారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌నిచేశారు.ఇప్పుడు ర‌జ‌నీ కూడా అదే స్థాయిలో ప‌నిచేయాల్సి ఉంది.అయితే ఆయ‌న‌పై కొన్ని అవినీతి ఆరోపణ‌లు సైతం ఉన్నాయి. మ‌హిళ‌లే కాదు బీసీ ల నుంచి ఎంపికైన పలువురు నాయ‌కులు కూడా సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణాల్లో భాగంగానే వ‌చ్చిన వారు.

అయితే బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం క‌న్నా తామే ఎక్కువ‌గా సంబంధిత బ‌డుగు వ‌ర్గాల‌కు గొడుగు ప‌ట్టామ‌ని వైసీపీ ప‌దే ప‌దే చెబుతోంది. బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడింది, వారిని అక్కున చేర్చుకున్న‌దీ తామేన‌ని అంటోంది. ఇక బాగా వెనుక‌బ‌డిన జిల్లాల నుంచి బీసీల నుంచి వ‌చ్చిన ధ‌ర్మాన కానీ సీదిరి అప్ప‌ల్రాజు కానీ నిజం గానే ముఖ్య‌మంత్రికి రుణ‌ప‌డి ఉంటామ‌ని అంటున్నారు.అదేవిధంగా ఎస్సీల‌కు, ఎస్టీల‌కూ మంచి ప్రాధాన్య‌మే ఇచ్చార‌ని సంబంధిత మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. తాము క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి సీఎం న‌మ్మ‌కాన్ని నిలుపుతామ‌ని అంటున్నారు.