Begin typing your search above and press return to search.
ఆ వదంతితో తాళిబొట్టు తీసేస్తున్నారు
By: Tupaki Desk | 7 July 2017 5:49 AM GMTహిందూ సమాజంలో తాళిబొట్టుకు ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పొరపాటున తాళి దారం తెగితే.. అది తెగిందన్న మాటను నోటితో చెప్పకుండా పెరిగిపోయిందంటారే కానీ తెగిపోయిందన్న మాట చెప్పేందుకు సైతం ఇష్టపడరు. అలాంటిది తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు.. తమ తాళిబొట్లను తీసి పక్కన పెడుతున్న వైనం అంతకంతకూ పెరిగిపోతోంది. మంగళసూత్రాన్ని పక్కన పెట్టేసేంతలా మహిళల్ని ప్రభావితం చేస్తున్నదేమిటన్నది చూస్తే.. ఒక వదంతితో మహిళలు మంగళసూత్రాన్ని పక్కన పెట్టేస్తున్నారు.
మంగళసూత్రంలో పగడాలు మాట్లాడుకుంటున్నాయని.. అవి మాట్లాడుకుంటే భర్త చనిపోతాడన్న వదంతి జోరుగా ప్రచారం జరుగుతుండటంతో.. తమ మెడలోని మాంగల్యాన్ని తీసి పక్కన పెడుతున్నారు మహిళలు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలు.. మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా ఈ టాపిక్ జోరుగా వైరల్ అవుతోంది.
ఈ వదంతితో భయపడిపోతున్న మహిళలు.. తమ మెడలో నుంచి మంగళసూత్రాన్ని పక్కన పెడుతున్న వారు కొందరైతే.. మరికొందరు పుస్తెల్లో ఉన్న పగడాల్ని పగలకొట్టిస్తున్నారు. ఇంకొందరు పసుపు కొమ్ముతో కట్టిన పసుపు తాడును మెడలో వేసుకుంటున్నారు.
మంగళసూత్రాల పైన చిన్న పగడం ఉంటుంది. రెండు సూత్రాలకు ఉండే రెండు పగడపు రాళ్లు మాట్లాడుకుంటున్నాయని.. అలా మాటలు సాగటం భర్త ప్రాణానికి ముప్పు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో.. భయపడిపోతున్న మహిళలు మంగళసూత్రాన్ని పక్కన పెడుతున్నారు. ఈ వదంతిని నమ్ముతున్న మహిళలు.. తమ పుస్తెల్లో ఉండే పగడాల్ని తీసివేసేందుకు ఇష్టపడుతున్నారు. బంగారు షాపులకు వెళ్లి.. సూత్రాల్లోని పగడాలను తీయిస్తున్నారు. జోరుగా వైరల్ అవుతుందన్నది వదంతి అని తెలిసినప్పటికి.. ముందస్తు జాగ్రత్త పడితే తప్పేందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ వదంతి కర్ణాటక శివారు జిల్లాల నుంచి వ్యాప్తి చెందిందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. చూస్తుంటే.. పగడాలు మాట్లాడుకోవటం వదంతిపై సాములోరు నోరు విప్పే టైం వచ్చేసినట్లుగా ఉందని చెప్పక తప్పదు.