Begin typing your search above and press return to search.

మగాళ్లు లేని ఈ గ్రామంలో మహిళలు పిల్లల్ని ఎలా కంటున్నారంటే..?

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:05 AM GMT
మగాళ్లు లేని ఈ గ్రామంలో మహిళలు పిల్లల్ని ఎలా కంటున్నారంటే..?
X
వాటికన్ సిటీ.. ఈ గ్రామం పేరు అందరికీ తెలుసు.. ఇక్కడా మగాళ్లు మాత్రమే జీవిస్తారు.. ఆడవాళ్లు కనిపించరు. .. అయితే మగాళ్లకు మాత్రమే ఓ విలేజ్ ఉన్నట్లు.. ఆడవాళ్లకు ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలోకి ఒక్క మొగ పురుగును రానివ్వరు. అయితే ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఇక్కడున్న ఆడవాళ్లంతా గర్భం దాల్చుతున్నారు. మిగతా ఆడవాళ్లలాగే పిల్లల్ని కంటున్నారు. అయితే మగాళ్లు లేకుండా అదెలా సాధ్యం..? ఏవైనా ఆయుర్వేద మందులు వాడుతున్నారా..? లేక మరేదైనా అద్భుతం జరుగుతుందా..? రీడ్ ఇట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ..

టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఈ భూమ్మీద ఉన్న వింతలు, విశేషాలు మన కంటపడుతున్నాయి. ఆశ్చర్యపరిచే సంగతులు తెలుస్తున్నాయి. అలాగే దక్షిణాఫ్రికాలోని ఓ గ్రామం కూడా వింతగానే ఉంది. 1990లో ఉమెజా ఈ గ్రామం ఏర్పడింది. బ్రిటిష్ సైనికులు దాడి చేసినప్పుడు ఇక్కడి కొందరు ఆడవాళ్లపై అత్యాచారాలు చేశారు. దీంతో వారికి పురుషులపై విరక్తి పుట్టింది. ఇలా అత్యాచారాలకు గురైన వాళ్లంతా కలిసి ఇక్కడ కలిసి ఉంటున్నారు. ఈ గ్రామంలోకి ఒక్క పురుషుడిని కూడా అనుమతించరు. రోజూ వారీ కార్యక్రమాలంతా మహిళలే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కెన్యా రాజధాని నైరోబికి 380 కిలోమీటర్ల దూరంలో ఉమెగా గ్రామం ఉంది. ఆ గ్రామంలో దాదాపు 250 మంది మహిళలు జీవిస్తున్నారు. వీళ్లతో పాటు కొందరు పిల్లలు ఉంటున్నారు. వీరి వస్త్రాధారణ కూడా వింతగా ఉంటుంది. 1990లో 15 మంది మహిళలు కలిసి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మిగతా ఇక్కడి స్త్రీలు ఒంటరిగానే జీవిస్తున్నారు. కాని మిగతా మహిళల్లాగే పిల్లల్ని కంటున్నారు. ఈ వింతను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. వీరు ఏదైనా అద్భతం చేస్తున్నారా..? లేక మెడిసిన్ వాడుతున్నారా..? అని రకరకాలుగా చర్చలు పెట్టుకుంటున్నారు.

కానీ కొన్ని పరిశోధనల ప్రకారం తేలిందేమిటంటే.. ఇక్కడ ఎలాంటి అద్భుతం జరగడం లేదు.. ఎవరూ మెడిసిన్ వాడడం లేదు. ఎంత ఒంటరిగా జీవిస్తున్నా.. కొంత మంది మహిళలు సీక్రెట్ గా పురుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారట. అంటే గ్రామంలోకి పురుషులు రానివ్వరు. కానీ కొంత మంది మహిళలు ఇతర గ్రామాల్లోకి వెళ్లి పురుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అలాగే కొందరు మొగాళ్లు రాత్రి పూట గ్రామంలోకి చొరబడుతున్నారు. ఇలా వీరి కలయిక వల్ల కొంత మంది మహిళలు గర్భం దాల్చుతున్నారు. అయితే మిగతా వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

కానీ బాధాకరమైన విషయమేంటంటే పుట్టిన వారికి తమ తండ్రి ఎవరనేది తెలియడం లేదు. ఆడపిల్ల పుడితే వాళ్ల వద్దే ఉంచుకుంటారు. మొగపిల్లాడు పుడితే యుక్త వయసు వచ్చే వరకు పెంచుతారు. ఆ తరువాత ఊరు బయట వదిలేస్తారు. దట్టమైన అడవుల్లో ఉండే ఈ గ్రామంలోని పిల్లలంతా ఒకేచోట ఉంటారు. ఆ ఊరిలో సాంబూరు నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇక్కడికి పురుష పర్యాటకులు రావచ్చు. కానీ అక్కడ నివసించడానికి వీల్లేదు. చీకటిపడగానే వెళ్లాలి అనే నిబంధన పెట్టుకున్నారు.