Begin typing your search above and press return to search.

విశాఖ‌లో అందాల పోటీలు...మ‌హిళ‌ల ధ‌ర్నా

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:26 AM GMT
విశాఖ‌లో అందాల పోటీలు...మ‌హిళ‌ల ధ‌ర్నా
X
విశాఖలో అందాల పోటీల వివాదం మళ్లీ మొదలైంది. మిస్ వైజాగ్ పోటీలను నిర్వహించొద్దంటూ మహిళా సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఇప్పటికే మహిళలపై క్రైమ్ రేట్ పెరుగుతున్న సాగర తీరంలో ఇలాంటి పోటీలతో... మరింత దాడులు పెరిగే అవకాశం ఉందంటూ ఆందోళన చేస్తున్నారు. మిస్ వైజాగ్ పోటీలను రద్దు చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. అంతేకాకుండా మిస్ వైజాగ్ అందాల పోటీలకు నిరసన సెగ తాకింది. అది ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తగిలింది.

మరికాసేపట్లో సాగరతీరంలో మిస్ వైజాగ్-2017 ఫైనల్స్ జరగనున్నాయ‌నే స‌మ‌యంలో...మిస్ వైజాగ్ -2017 అందాల పోటీలను బహిష్కరించాలని మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేస్తూ ఆయన నివాసం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గంటా స్పందిస్తూ - పోటీలు నిర్వహించే తీరుతెన్నులు తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, మహిళల అంగాంగ ప్రదర్శన చేయడం 1986 యాక్టు కింద నేరమని - ఈ పోటీలను తక్షణమే నిలిపివేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

అందాల పోటీలను వ్యతిరేకిస్తూ.. ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో డీజీపీని కలిసి కూడా ఫిర్యాదు చేశామని వారు చెబుతున్నారు. అప్పుడు సానుకూలంగా స్పందించినా.. ఆ తర్వాత మాత్రం పోటీలను ఆపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ పోటీలను ఆపాలంటూ రోజురోజురై ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. పలువురు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోటీలు జరగుతున్న హోటల్‌ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు మధ్యలోనే మివస్ వైజాగ్ ఫైనల్స్ కొనసాగాయి.

ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు పెరిగాయి. కొన్నిరోజుల క్రితం విశాఖలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ మీద ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. స్మార్ట్ సిటీగా మారుతున్న విశాఖ.. ఇలా క్రైమ్ సిటీగా మారుతోందనేది మహిళా సంఘాల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీల పేరుతో యువతను వెర్రెత్తించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.