Begin typing your search above and press return to search.

అక్కడ ఆడ పురుగులు.. పక్షులకే ఎంట్రీ

By:  Tupaki Desk   |   2 Jun 2016 4:00 AM IST
అక్కడ ఆడ పురుగులు.. పక్షులకే ఎంట్రీ
X
స్త్రీ ద్వేషుల గురించి వినే ఉంటాం. ఆ విషయాన్ని పక్కన పెడితే.. కొన్నిచోట్ల మహిళలకు ఎంట్రీ ఉండదన్నది తెలిసిందే. మన దగ్గర కూడా కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉండదు. అయితే.. ఇప్పుడు చెప్పే ఉదంతం ఇందుకు భిన్నం. ఆడవాళ్లకే కాదు.. ఆడ జంతువుల్ని కూడా దగ్గరకు రానివ్వని ఒక ప్లేస్ గురించి ఇప్పుడు మీకు పరిచయం చేస్తాం. దాదాపు వెయ్యి ఏళ్ల కింద విధించుకున్న కట్టుబాటును నేటి డిజిటల్ యుగంలోనూ అక్కడ అమలు చేయటం చూస్తే ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఆడవాళ్లకే కాదు.. ఆడ జంతువులకు కూడా ఎంట్రీకి నో చెప్పే ఆ ప్లేస్ ఉత్తర గ్రీస్ లో ఉంది.

అక్కడి ‘మౌంట్ ఎథోస్’ అన్న ప్రాంతంలోని శిఖరంపైకి ‘‘ఆడ’’ అన్నదే తమ దగ్గరకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకిలా అంటే.. అక్కడంతా మగ సన్యాసులే ఉంటారు మరి. అందుకే.. స్త్రీ లింగ జంతువులనూ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 1046లో విధించిన ఈ కట్టుబాటును బ్రేక్ చేసే వారిపై తీవ్ర శిక్షలు విదించే వారు. అయితే.. 14వ శతాబ్దంలో సెర్బియా చక్రవర్తి డూసాన్ భార్య రాణీ హెలెనాకు ప్లేగ్ వ్యాధి సోకగా.. చికిత్స కోసం ఈ పర్వత ప్రాంతానికి తీసుకొచ్చారు. అంతటి రాణిని సైతం అక్కడ ఉండేందుకు సన్యాసులు నో అని చెప్పటంతో ఆమె కాలును కూడా కిందకు పెట్టకుండా వెనక్కి పంపించారట. అంత కఠినంగా ఉండే అక్కడి సాధువులు.. ఆడ పురుగులు.. ఆడ పక్షులకు తప్ప మరే ‘‘స్త్రీ’’ లింగానికి అక్కడ ఎంట్రీ ఉండదట.