Begin typing your search above and press return to search.

విన్నాక నిజమే కదా అనిపించే ఆమె డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   25 Dec 2022 10:30 AM GMT
విన్నాక నిజమే కదా అనిపించే ఆమె డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్
X
తనకు నష్టం కలగని వాటి విషయంలో జగన్ చాలా పెద్ద మనసుతో వ్యవహరిస్తారని చెబుతారు. చెప్పే విధంగా చెప్పాలే కానీ.. ఆయన కొన్ని మాటల్ని వినేందుకు అస్సలు వెనుకాడరు. తనకు సలహాలు ఇచ్చే గొంతుకలు మాట్లాడే వారిని పెద్దగా ఇష్టపడని జగన్.. అదే విషయాన్ని సూచన మాదిరి చెప్పాలే కానీ ఆయన స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాదిరి కాకుండా.. విషయాలు ఏవైనా సరే పట్టింపులకు పోకుండా ముందుకు వెళ్లే ధోరణి ఎక్కువని చెబుతుంటారు. తాజాగా వినిపిస్తున్న డిమాండ్ ఏమంటే.. ఏపీలో జిల్లాల సంఖ్యను డబుల్ చేసిన వేళ.. ఒక్క జిల్లాకైనా మహిళ ప్రముఖుల పేరును పెట్టారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఆ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చిన ఘనత అరుణ అనే మహిళది. ఇంతకూ ఆమె ఎవరంటే? రచయిత్రిగా.. అభ్యుదయ వాదిగా సుపరిచితం. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘాన్ని స్థాపించిన ఆమె.. ఏపీలో పెరిగిన జిల్లాల్లో ఒక్కదానికైనా మహిళ పేరును పెట్టకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు.

స్టెమ్ రంగంలోనే కాదు సాహిత్యంలోనూ పురుషాధిక్యతే అని.. స్త్రీలు రచనలు చేయలేరన్న భావం ఎక్కువగా ఉందని చెప్పే ఆమె.. రచనలలో వివక్ష తగ్గితే.. తెలుగుకు వైభవమని అభివర్ణిస్తారు. సామాజిక సమస్యల మీద స్పందించటమే కాదు.. ఏ మహిళ కైనా కష్టం వచ్చిందంటే చాలు.. వెంటనే నేనున్నానంటూ ఆమె స్పందించే తీరు అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె తన గళాన్ని వినిపిస్తున్నారు. ఏపీలో పెరిగిన జిల్లాల్లో ఏదో ఒక దానికి మహిళ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలి కదా? అన్నది ఆమె సూటి ప్రశ్న. 2016లో ఆమె ఏర్పాటు చేసిన నరసం (నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం) అన్ని రంగాల్లో మహిళలపై వివక్షను నిరసిస్తూ సభలు.. చైతన్య కార్యక్రమాల్ని స్థాపిస్తున్నారు.

తన డిమాండ్ అయిన కొత్త జిల్లాల్లో ప్రముఖ మహిళ పేరుతో ఒక జిల్లా ఉండాలన్న ఆమె ఆకాంక్షను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని ఆశిద్దాం. మరి.. ఇలాంటి విషయాల్లో జగన్ స్పందన ఆయనకు మరింత మైలేజీ తెచ్చి పెడుతుందన్నది మర్చిపోకూడదు.