Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాను అమ్మాయిలు దున్నేస్తున్నారట..
By: Tupaki Desk | 21 July 2016 5:30 PM GMTకుర్రకారు ఫేవరెట్ డిజిటల్ డెస్టినేషన్ సోషల్ మీడియా. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఫేస్ బుక్ - ట్విటర్ - ఇన్ స్టాగ్రామ్ - పింట్రెస్ట్ - టంబ్లర్ ల... ఇలా ప్రతి సోషల్ మీడియా సైట్ యువతకు హాట్ ఫేవరెట్. అయితే... తాజాగా తెలిసిన కొత్త విషయం ఏంటంటే యువతలో అమ్మాయిలు ఈ విషయంలో మరింత స్పీడుగా ఉన్నారట. సోషల్ మీడియా వాడకంలో అమ్మాయిలు అబ్బాయిలను డామినేట్ చేస్తున్నారట.
పాశ్చాత్యదేశాల్లో అమ్మాయిలే సోషల్ మీడియాను అధికంగా ఉపయోగిస్తున్నారని లేటెస్టు సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ వాడే వారిలో ఫేస్ బుక్ యూజర్లుగా ఉన్న అమ్మాయిల శాతం 76గా ఉందని తేలింది. ట్విట్టర్ వాడకంలోనూ ఫీమేల్ యూజర్లదే పైచేయి అట. పింట్రెస్ట్ - ఇన్ స్టాగ్రామ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. వీటికీ అమ్మాయిల ఆదరణే ఎక్కువగా ఉంది. అమెరికాలో వీటికి యూజర్లుగా ఉన్న మహిళల సంఖ్య కోటికి చేరింది. అయితే లింక్డ్ ఇన్ సైట్ మాత్రం మేల్ యూజర్ల డామినేషన్లో ఉంది.
మరి పాశ్చాత్య దేశాల సంగతి సరే.. మన దేశం మాటో. ఫేస్ బుక్ - ట్విటర్లు ఇంకా ఇండియాలో ఈ లెక్కలను రిలీజ్ చేయనప్పటికీ ఇక్కడ అమ్మాయిల కంటే అబ్బాయిల వాడకమే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సాంకేతిక విషయంలోనూ ఇక్కడ లింగ వివక్ష ఉందని అంతర్జాతీయ టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.