Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట‌.. కేంద్రం వెల్ల‌డి

By:  Tupaki Desk   |   11 April 2022 2:30 AM GMT
ఏపీలో మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట‌.. కేంద్రం వెల్ల‌డి
X
దేశంలో మ‌హిళ‌ల సాధికార‌త‌కు పెద్ద పీట వేస్తున్న‌రాష్ట్రాల్లో ఏపీ ముందుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలోని 100 మంది మ‌హిళ‌ల్లో 47.9 శాతం మంది.. మ‌హిళ‌లు నిర్ణ‌యాలు తీసుకునే నాయ‌క త్వ స్థాయిలో ముందున్నార‌ని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కీల‌క నిర్ణ‌యాలను ఈ సంద‌ర్భంగా.. ప్ర‌స్తావించింది. క్షేత్ర‌స్థాయిలో అన్ని ప‌ద‌వుల్లోనూ.. మ‌హిళ‌ల‌కు 50 శాతం అవ‌కాశాలు ఇవ్వ‌డం క‌లిసి వ‌స్తోంద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

పంచాయ‌తీలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, కార్పొరేష‌న్ల చైర్‌ప‌ర్స‌న్ స్థానాలు స‌హా.. ఇత‌ర క‌మ్యూనిటీ కార్పొరేష‌న్ల లోనూ మ‌హిళ‌ల‌కు ఎక్కువ శాతం ప‌ద‌వులు ఇవ్వ‌డం వ‌ల్లే.. వారు.. నాయ‌క‌త్వ స్థాయిలో పెద్ద స్థానం పొందా రని.. కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఇలా అన్ని స్థానాల్లో మ‌హిళ‌ల‌కు ప‌ద‌వులు ఇచ్చిన రాష్ట్రం ఒక్క ఆంధ్ర‌ప్ర‌దే శ్ మాత్ర‌మేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇది మంచి ప‌రిణామ‌మ‌ని కూడా పేర్కొంది. మ‌హిళా సాధికారిక‌త‌కు ఇది మంచి నిర్ణ‌య‌మ‌ని పేర్కొంది. ఇక‌, దేశ‌వ్యాప్తంగా మ‌హిళా సాధికార‌త రేటు.. 23.2 శాతం మాత్ర‌మే ఉంద‌ని కేంద్రం వెల్ల‌డించింది.

అంతేకాదు.. మంత్రి వ‌ర్గంలోనూ ఆశించిన మేర‌కు మ‌హిళ‌ల‌కు ఏపీలో ప్రాధాన్యం ల‌భించింద‌ని కేంద్రం పేర్కొంది. ఇత‌ర రాష్ట్రాల‌ను చూస్తే.. క‌ర్ణాట‌క 28.1 శాతం, త‌మిళ‌నాడు 29.2 శాతం, మ‌హారాష్ట్రలో 28 శాతం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ 21 శాతం, రాజ‌స్థాన్ 19.3 శాతం మాత్ర‌మే మ‌హిళ‌ల‌కు ప‌ద‌వుల్లోనూ.. సాధికారత విష‌యంలోనూ ప్రాధాన్యం ఉంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఈ జాబితాలో చూసుకున్న‌ప్పుడు.. ఏపీ మ‌హిళ‌ల విష‌యంలో ముందుంద‌ని కేంద్రం తెలిపింది. ఈ ప‌రిణామంపై వైసీపీ స‌ర్కారు ఆనందం వ్య‌క్తం చేస్తోంది.