Begin typing your search above and press return to search.
పాక్ కెప్టెన్ బాబర్‌కు షాక్..! రూ. 45 లక్షలు భరణం ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన యువతి..!
By: Tupaki Desk | 25 Dec 2020 11:45 AM GMTపాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ పై కొంతకాలంగా ఓ యువతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె తాజాగా కోర్టుకెక్కింది. తాను కేసు ఉపసంహరించుకోవాలంటే బాబర్ రూ. 45 లక్షలు భరణం చెల్లించాలంటూ ఆమె డిమాండ్ చేసింది. బాబర్ తనను మోసం చేశాడని.. లైంగికంగా వాడుకున్నాడని హమీజా అనే యువతి కొంతకాలం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాబర్ తనను గర్భవతిని చేశాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలంటూ బాబర్ మనుషులు బెదిరించారని కూడా సదరు యువతి గతంలో మీడియాతో చెప్పారు. అయితే ఈ విషయం పాకిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం యువతి కోర్టులో పిటిషన్ వేయడంతో మరోసారి ఈ ఘటన వెలుగుచూసింది. బాబర్ ఆజమ్‌పై కేసును విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ హమీజా ముక్తర్ డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఆమె కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
హమీజా పిటిషన్‌పై గురువారం పాక్ సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. హమీజ్ బాబర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆమెకు ఒక్కరూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని బాబర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. గతంలో హమీజా ఏమన్నదంటే.. ‘బాబర్ నేను స్కూల్ ఫ్రెండ్స్. అతడు క్రికెటర్ కాకముందే నేను ఎంతో ఆర్థికసాయం చేశాను. 2010లో నన్ను పెళ్లిచేసుకుంటానని బాబర్ మాటిచ్చాడు. నేను అతడితో సహజీవనం చేశాను. గర్భవతిని కూడా అయ్యాను.
కానీ బాబర్ స్టార్ క్రికెటర్ అయ్యాక నన్ను మరిచిపోయినట్టు నటిస్తున్నాడు. నన్ను దూరం పెడతున్నాడు. నాకు పోలీసులు కూడా సాయం చేయడం లేదు. బాబర్ వైపే మాట్లాడుతున్నారు’ అంటూ గతంలో ఆమె ఆరోపణలు చేశారు.