Begin typing your search above and press return to search.

అత్యాచారం ఆ తర్వాత బ్లాక్ ‌మెయిల్..తెలంగాణలో మరో దారుణ ఘటన !

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:31 PM GMT
అత్యాచారం ఆ తర్వాత  బ్లాక్ ‌మెయిల్..తెలంగాణలో మరో దారుణ ఘటన !
X
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత నిరసన వ్యక్తమవుతున్నా , ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న , నిందితులకు ఎంత కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో మార్పు రావట్లేదు. ఓవైపు ఉత్తరప్రదేశ్లో ని హత్రాస్ ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తుంటే ... మరోవైపు మహిళలపై ఆకృత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఆదిలాబాద్‌ లో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇటీవల హైదరాబాద్ ట్రాన్స్ ‌ఫర్ కోసం ఓ తెలిసిన వ్యక్తిని సంప్రదించింది. ఆమె భర్త,పిల్లలు హైదరాబాద్‌ లో ఉండటంతో తాను కూడా అక్కడికే బదిలీ చేయించుకోవాలనుకుంది. ఈ క్రమంలో బంధువుల ద్వారా మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పరిచయమయ్యాడు. తనకు రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు తెలుసునని.. హైదరాబాద్ బదిలీ చేయిస్తానని నమ్మబలికాడు. బదిలీకి కొంత ఖర్చవుతుందని ఆమె నుంచి చంద్రశేఖర్ కొంత డబ్బు కూడా తీసుకున్నాడు. అనంతరం బాధితురాలిని వెంటపెట్టుకుని అధికారులను కలవాలని చెప్పి హైదరాబాద్ వచ్చాడు

ఇదే అదనుగా నగరంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి నీ ఫోటోలు, వీడియోలు ఉన్నాయని చెప్పి ఆమెను బ్లాక్‌ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. అలా ఆమె నుంచి రూ.10లక్షలు నగదు, 35 తులాల బంగారం కొట్టేసాడు.ఎంత డబ్బులు ఇచ్చినా అతని వేధింపులకు తెరపడకపోవడంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే కుమిలిపోయింది. చివరకు ధైర్యం చేసి ఈ నెల 3న ఆదిలాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరింది. మోసం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అదుపులోకి తీసుకోని, దర్యాప్తు చేస్తున్నారు.